Big News Big Debate: ST రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరలేదా? పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణపై కుట్ర జరుగుతోందా?

వరిపై యుద్ధం జరుగుతుండగానే కేంద్ర, రాష్ట్రాల మధ్య ఢిల్లీలో కొత్త రచ్చ మొదలైంది. SCలకు రిజర్వేషన్ల బిల్లుపై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన..

Big News Big Debate: ST రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరలేదా? పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణపై కుట్ర జరుగుతోందా?
Big News Big Debate
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2022 | 9:49 PM

Big News Big Debate: వరిపై యుద్ధం జరుగుతుండగానే కేంద్ర, రాష్ట్రాల మధ్య ఢిల్లీలో కొత్త రచ్చ మొదలైంది. SCలకు రిజర్వేషన్ల బిల్లుపై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై భగ్గుమంటున్నారు TRS నాయకులు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చిన మంత్రిని బర్తరఫ్‌ చేయాలంటున్నారు MPలు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని గులాబీనేతలంటే.. రిజర్వేషన్లపై నిర్ణయం రాష్ట్రాలదే అంటోంది బీజేపీ.

ST రిజర్వేషన్ల పెంపు వ్యవహారం కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంపై TRS ఎంపీలు భగ్గుమంటున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపింద‌ని డేట్స్‌ తో సహా TRS ఎంపీలు ప్రకటించారు. సభను త‌ప్పుదోవ ప‌ట్టించిన మంత్రి బిశ్వేశ్వర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్తర‌ఫ్ చేయాల‌ంటోంది TRS. అబ‌ద్ధాలాడి, పార్లమెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన మంత్రిపై ప్రివిలేజ్‌ నోటీస్‌ ఇచ్చామంటున్నారు.

గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కేంద్రం అడుగడుగునా అడ్డుకుంటోందనీ.. రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతోందని విమర్శిస్తోంది TRS. కేంద్రమంత్రి ప్రకటనలపై భగ్గుమన్న గిరిజన సంఘాలు హైదరాబాదులో బీజేపీ ఆఫీసును ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకే ఉందంటోంది BJP.

జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే తెలంగాణ‌ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ప్రస్తుతం ఇది కేంద్రం పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ గతంలోనే చెప్పింది. కానీ పార్లమెంటులో తాజాగా మంత్రి చేసిన ప్రకటన ఒక్కసారిగా కలకలం రేపింది.

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే