Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2022 (IPL 2022) ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్‌ కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు...

Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..
Csk
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 23, 2022 | 11:11 PM

మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2022 (IPL 2022) ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్‌ కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు కసరత్తులు ప్రారంభించాయి. అయితే నాలుగుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-15కి సంబంధించి తమ కొత్త జెర్సీని బుధవారం ఆవిష్కరించింది. CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక వీడియోలో జెర్సీని అన్‌బాక్స్ చేశాడు. గత సంవత్సరం CSK భారత సాయుధ దళాలకు నివాళిగా జెర్సీపై camouflage పెట్టింది. CSK 2010, 2011, 2018, 2021లో టైటిల్ గెలుచుకుంది. TVS యూరోగ్రిప్, టూ, త్రీ-వీలర్ టైర్ బ్రాండ్ CSK ప్రధాన స్పాన్సర్లుగా ఉన్నారు.

CSK CEO KS విశ్వనాథన్ మాట్లాడుతూ ” చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ జెర్సీపై విశ్వసనీయమైన, విజయవంతమైన లోగోను కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. TVS యూరోగ్రిప్, మన సైనికులకు గౌరవ సూచకంగా, సైన్యంతో మా కెప్టెన్‌కు అనుబంధం, మేము గత సంవత్సరం భుజాలపై camouflage విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. 27న ఢిల్లీ క్యాపిటల్స్ Vs ముంబాయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ Vs బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Read Also.. CSK New Captain: ధోనీ వారసులుగా వీరైతేనే బెటర్: సీఎస్‌కే కొత్త సారథిపై రైనా కీలక వ్యాఖ్యలు..