IPL 2022: ఐపీఎల్ ద్వారా వందల కోట్లు సంపాదించిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బీసీసీఐ(BCCI)కే కాదు ఆటగాళ్లకు కోట్లు తెచ్చి పెట్టింది. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్‌కు ప్రజల్లో ఆదారణే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బీసీసీఐ(BCCI)కే కాదు ఆటగాళ్లకు కోట్లు తెచ్చి పెట్టింది. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్‌కు ప్రజల్లో ఆదారణే. అందుకే కొత్త జట్లు పుట్టుకొస్తున్నాయి. ఐపీఎల్ 2022 (IPL 2022)లో 10 జట్లు తలపడనున్నాయి. IPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లకు అత్యంత లాభదాయకమైన లీగ్‌గా మారింది. ఈ లీగ్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డబ్బు సంపాదించింది ఎవరు అనేది చాలా మందికి తెలియదు. ఐపీఎల్ ద్వారా అత్యధికంగా డబ్బు సంపాదించిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఎబీ డివిలియర్స్: ఐపీఎల్ నుంచి అత్యధికంగా ఆర్జించిన వారి జాబితాలో దక్షిణాఫ్రికా గ్రేట్ ఎబీ డివిలియర్స్ 5వ స్థానంలో ఉన్నాడు. డివిలియర్స్ ఐపీఎల్ లీగ్ నుంచి మొత్తం రూ. 1,02,51,65,000 (100 కోట్లకు పైగా) సంపాదించాడు. గత ఏడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి అతని చివరిగా రూ.11 కోట్ల జీతం తీసుకన్నాడు.
సురేష్ రైనా: IPL 2022 సీజన్ మెగా వేలంలో ఎవరూ కొనుగోలు చేయని సురేష్ రైనా ఐపీఎల్ నుంచి అత్యధికంగా ఆర్జించిన వారి జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు తన IPL కెరీర్‌లో రూ. 1,10,74,00,00 (రూ. 110 కోట్లకు పైగా) సంపాదించాడు. రైనా తన ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ భాగం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. అతని చివరిగా రూ.11 కోట్ల జీతం తీసుకున్నాడు.
విరాట్ కోహ్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన జావితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ తన IPL కెరీర్‌లో ఇప్పటివరకు రూ. 1,58,20,00,000 (రూ. 150 కోట్లకు పైగా) సంపాదించాడు. కోహ్లీ రూ. RCBలో అతని గత 4 సీజన్లలో 17 కోట్ల చొప్పున జీతం తీసుకున్నాడు. అయితే, ఐపీఎల్ 2022లో అతను రూ. 15 కోట్లు తీసుకోనున్నాడు.
రోహిత్ శర్మ: ఐపీఎల్ టీ20 లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు రోహిత్ శర్మ. ఇతను అత్యధికంగా ఆర్జిన జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు రోహిత్ తన IPL కెరీర్‌లో రూ.62,60,00,000 (రూ. 160 కోట్లకు పైగా) సంపాదించాడు. రోహిత్ తన కెరీర్‌లో చాలా వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.IPL 2022 సీజన్‌లో రూ. 16 కోట్లు తీసుకోనున్నాడు. ఐపీఎల్ సీజన్‌లో రోహిత్‌కి ఇదే అత్యధికం.
MS ధోని: మిస్టర్ కూల్, భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ MS ధోని అత్యధికంగా సంపాదించిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. IPL 2022 సీజన్ వరకు IPLలో అతని మొత్తం సంపాదన రూ. 1,64,84,00,000 (రూ. 164 కోట్లకు పైగా) ఉంది. ధోనీ రూ. CSKలో గత 4 సీజన్లలో 15 కోట్ల చొప్పున తీసుకున్నాడు.