IPL 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. బుక్ మై షో పోర్టల్‌లో ఐపీఎల్ టికెట్లు.. ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్-2022 (IPL 2022) సీజన్ శనివారం (మార్చి26)న ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడనున్నాయి.
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్-2022 (IPL 2022) సీజన్ శనివారం (మార్చి26)న ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడనున్నాయి. కాగా కొవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ (BCCI) ప్రకటించింది. అదేవిధంగా కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో మ్యాచ్‌లకు కేవలం 25 శాతం కెపాసిటీతోనే ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల బుకింగ్ కూడా బుధవారం (మార్చి23)న ప్రారంభమైంది. కాగా ఐపీఎల్ టికెట్ల విక్రయానికి సంబంధించి బీసీసీఐ ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక బుక్ మై షో (Bookmyshow)తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం టికెటింగ్ రైట్స్‌తో పాటు అన్ని స్టేడియంలలో గేట్ ఎంట్రీ, స్పెక్టేటర్ మేనేజ్‌మెంట్ సర్వీసులను కూడా బుక్ మై షో సంస్థ అందించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి మన దేశంలో జరగనున్నాయి. అభిమానులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని కఠినమైన కొవిడ్ ప్రొటోకాల్స్ అనుసరిస్తుందని బుక్ మై షో ప్రతినిధి అనిల్ మఖిజా తెలిపారు. కాగ టికెట్ ప్రారంభ ధర రూ.800 నుంచి ప్రారంభమవుతుందని పోర్టల్ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబయి, నవీ ముంబయి, పుణెలో నాలుగు మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబయిలోని వాంఖడే, బ్రాబౌర్న్ మైదానాల్ల్లో 20 , నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో 15, పుణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు..
AIMIM: మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడితో పొత్తుకు AIMIM ప్రతిపాదన.. అయోమయంలో శివసేన..