AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIMIM: మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడితో పొత్తుకు AIMIM ప్రతిపాదన.. అయోమయంలో శివసేన..

మహారాష్ట్ర ప్రస్తుతం భిన్నమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. విభిన్నమైన మతతత్వ సిద్ధాంతాలతో ఉన్న రెండు రాజకీయ పార్టీలు అక్కడ రాజకీయ దుమారం రేపుతున్నాయి...

AIMIM: మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడితో పొత్తుకు AIMIM ప్రతిపాదన.. అయోమయంలో శివసేన..
Asaduddin Owaisi
Srinivas Chekkilla
|

Updated on: Mar 23, 2022 | 9:56 PM

Share

మహారాష్ట్ర ప్రస్తుతం భిన్నమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. విభిన్నమైన మతతత్వ సిద్ధాంతాలతో ఉన్న రెండు రాజకీయ పార్టీలు అక్కడ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముస్లింలకు అనుకూలమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM), మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడి (MVA)తో ఎన్నికల పొత్తు ప్రతిపాదన రాజకీయంగా సంచలనం రేపింది. మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడి మూడు పార్టీల ఎన్నికల కూటమి. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను కిరాతకంగా చంపిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ముందు తలవంచుకునే వ్యక్తులతో తమకు ఎప్పటికీ జట్టు కట్టబోమని MVA ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన స్పష్టం చేసింది. శివసేనను హిందూ అనుకూల మతతత్వ పార్టీ అని AIMIM ఆరోపించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పొత్త ప్రతిపాదన చేశామని స్పష్టం చేసింది.

పొత్తు ప్రతిపాదనతో శివ సేనను ఇరుకున పెట్టిన మజ్లీస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దీనిపై స్పందించకపోగా, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. మహారాష్ట్రలో 11.54 శాతం ముస్లిం జనాభా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు హిందూ అనుకూల భావజాలాన్ని అనుసరించే శివసేన, బీజేపీతో, లౌకిక కూటమి కట్టిన NCP-కాంగ్రెస్‌ రాజకీయ విభేదం స్పష్టంగా ఉంది. సాంప్రదాయకంగా రాష్ట్రంలోని ముస్లింలు ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమికి ఓటు వేస్తారు. అయితే, AIMIM మహారాష్ట్రలో ముఖ్యంగా గతంలో నిజాంల హైదరాబాద్ ఎస్టేట్‌లో భాగంగా ఉన్న రాష్ట్రంలోని మరఠ్వాడా ప్రాంతంలో తన బలాన్ని పెంచుకుంటోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రెండు సీట్లు గెలుచుకోవడంతో AIMIMకి రాజకీయ ఆశ్రయం కల్పించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ రెండు సీట్లు గెలుచుకోగలిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఇంతియాజ్ జలీల్ విజయం సాధించాడు. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్ వెలుపల AIMIM సాధించిన మొదటి విజయం. ఆ రాష్ట్రంలో ఈ పార్టీ విస్తరణ క్రమక్రమంగా సాగుతోంది. ఆ పార్టీకి మహారాష్ట్రలో 60 మంది మున్సిపల్ కార్పొరేటర్లు, 40 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 102 మంది గ్రామపంచాయతీ సభ్యులు, ఒక జిల్లా పరిషత్ (జిల్లా కౌన్సిల్) సభ్యుడు ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ 44 స్థానాల్లో పోటీ చేసి 1.34 ఓట్లను పొందగలిగింది. రెండు స్థానాలు గెలుచుకుంది.

2024 ఎన్నికలలో AIMIM తన ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము, ఎందుకంటే MVA ఇప్పటి వరకు ఎన్నికలను ఎదుర్కొలేదు. ఇది ఎన్నికల అనంతర బంధం. ఈ బంధం ఉద్దేశం భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని అధికారం నుంచి దూరంగా ఉంచడం. ముస్లిం వ్యతిరేక పార్టీ అయిన శివసేనతో అధికారం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపి మహారాష్ట్రలో మొదటిసారిగా సొంతంగా విజయం సాధించడానికి ఎదురుచూస్తోంది. సిద్ధాంతపరంగా, NCP, కాంగ్రెస్, AIMIM కలిసి రావడం వల్ల ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయవచ్చు.

లాభాలు, నష్టాలు

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారాన్ని నిలుపుకుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాలపై దృష్టి సారిస్తుంది. ఇది కీలకమైన 2024 సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మహారాష్ట్రోలో బిజెపి ఎల్లప్పుడూ శివసేనతో పొత్తుతో పెట్టుకునేది. బిజెపి మొదట్లో జూనియర్ భాగస్వామిగా తరువాత సీనియర్ భాగస్వామిగా ఉంది. 2019లో ముఖ్యమంత్రి పదవిపై విషయమై ఈ కూటమి ముక్కలైంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల అంటే రాష్ట్రాలలో ముస్లిం ఓట్లను చీల్చడానికే ఉందని.. బిజెపికి బి టీమ్‌గా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు మద్దతుగా నిలిచిన కీలకమైన ముస్లిం ఓట్లను ఏఐఎంఐఎం చీల్చిందనే వాస్తవాన్ని కాదనలేం.

పెరిగిన ఓట్ల శాతం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో AIMIM పోల్ చేసిన 1.24 శాతం ఓట్లు చాలా తక్కువగా కనిపించవచ్చు, కానీ రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ ఫ్రంట్, ఇతర చిన్న పార్టీలతో కూడిన మహాగత్‌బంద్‌ను అధికారం నుంచి దూరంగా ఉంచడంలో అది పెద్ద పాత్ర పోషించింది. AIMIM రాష్ట్రంలో 1.03 శాతం ఓట్ల వాటాను పెంచుకోగలిగింది. ఐదు స్థానాలను గెలుచుకుంది. మహాఘటబంధన్ సాధారణ మెజారిటీకి కేవలం 12 సీట్ల దూరంలో నిలిచింది. ఎన్‌డిఎ నాయకత్వంలో ప్రత్యర్థి బిజెపి-జనతాదళ్ (యునైటెడ్) కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. AIMIM ఆ తరువాత పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే బిజెపి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ముస్లిం ఓటర్లు అడ్డుతగిలారు. తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో మమతా బెనర్జీ గెలిచారు. ఇక్కడ AIMIM కూడా విఫలమైంది. కేవలం 0.02 శాతం ఓట్లను సంపాదించగలిగింది. AIMIM అన్ని ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే, జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా, గోవా, ఉత్తరప్రదేశ్‌లలో కూడా పోటీ చేసింది. అయితే కాంగ్రెస్‌, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే అది శివసేనకు పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది.

Read  Also.. UPSC Civil Services 2021: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2021 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల..