UPSC Civil Services 2021: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2021 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయో, ఆ ప్రక్రియ ఏ విధంగా ప్రారంభమౌతుందో.. వంటి ఇతర ఆసక్తికర విషయాలు..
UPSC CSE 2021 Interview Schedule Released: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ 2021 ఇంటర్వ్యూ షెడ్యూల్ మంగళవారం (మార్చి 22)న విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు జరగనున్నాయి. కాగా మార్చి 21న విడుదలైన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2021 ఫలితాల ఆధారంగా ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి. చివరి ఘట్టమైన వ్యక్తిత్వ పరీక్షల (ఇంటర్వ్యూలు)కు సంబంధించిన ప్రక్రియ పూర్తయితే మెయిన్స్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు. వీటికి సంబంధించిన e-Summon Letters త్వరలో విడుదలకానున్నాయి. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఈ లెటర్‌ను తీసుకెళ్లవల్సి ఉంటుంది. లెటర్‌లో పొందుపర్చిన ఇంటర్వ్యూ తేదీ, సమయంలో మార్పుల కోసం అభ్యర్ధుల నుంచి ఎటువంటి అభ్యర్ధనలను స్వీకరించబడవని ఈ సందర్భంగా యూపీఎస్సీ తెలియజేసింది. తాజా నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in లేదా www.upsconline.in.లో చెక్ చేసుకోవచ్చు. కాగా యూపీఎస్సీ సీఎస్‌ఈ మెయిన్స్ డిటైల్డ్ అప్లికేషన్ ఫారమ్ (DAF) – II 2021ని కూడా విడుదల చేసింది. ఈ ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ మార్చి 24 (సాయంత్రం 6 గంటల వరకు). నిర్ణీత తేదీలోపు దరఖాస్తును పూరించడంలో విఫలమైన అభ్యర్థులకు ఇ-సమన్ లెటర్ జారీ చేయబడదని, వారి అభ్యర్థిత్వం కూడా రద్దవుతుందని యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో తెలియజేసింది.
Also Read: