Shocking! ఒకే ఒక్క రోజులో కారు ఓనర్‌కి 51 చలానాలు.. రూ.6 లక్షలకు పైగా జరిమానా! ఎందుకో తెలుసా..
రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించనివారికి శిక్షగా ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడం మామూలే. అయినప్పటికీ కొంతమంది ఎలాగోలా సిగ్నల్ జంప్ చేసి పరుగు లంకించుకుంటారు. ఆనక.. ఇంటికి భారీ స్థాయిలో చలానాలు రావడం, అవి కట్టలేక లబోదిబోమనడం షరా మామూలే..
1 person got 51 challans for his car in a single day: రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించనివారికి శిక్షగా ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడం మామూలే. అయినప్పటికీ కొంతమంది ఎలాగోలా సిగ్నల్ జంప్ చేసి పరుగు లంకించుకుంటారు (కెమేరా కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనేది జగమెరిగిన వాస్తవం). ఆనక.. ఇంటికి భారీ స్థాయిలో చలానాలు రావడం, అవి కట్టలేక లబోదిబోమనడం షరా మామూలే. ఇంతచేసీ ఎవరెకైనా వారానికి ఒకటో, రెండో చలానాలు వస్తాయి. ఐతే ఓ వ్యక్తి కారుకి కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 51 చలానాలూ (car challans) వచ్చాయట. అందుకుగానూ మొత్తం రూ.6 లక్షలకు పైగా జరిమానా కూడా పడిందట. అసలేంజరిగిందంటే..
విదేశాల్లో సాధారణంగా రెసిడెంట్ రోడ్లపై కార్లను నడపడానికి అనుమతి ఉండదు. ఈ రోడ్లపై బాటసారులు మాత్రమే నడవడానికి అనుమతి ఉంటుంది. ఐతే యూకేలోని లండన్‌కి చెందిన జాన్ బారెట్ (54) దగ్గరిలోని రెసిడెంట్ రోడ్‌పై కారునడిపినందుకుగానూ 51 చలాన్లు జారీ అయ్యాయి. అన్ని చలాన్లకు కలిపి మొత్తం రూ.6 లక్షలు పైగా పెనాల్టీ పడింది. వృత్తిరిత్యా బిల్డర్ అయిన జాన్ బారెట్ మీడియాతో మాట్లాడుతూ..ఈ చలాన్లన్నీ గత 5 నెలల్లో విధించారని, అవన్నీ ఈ నెల ప్రారంభంలో తనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే, అన్నీ ఒకేసారి పంపించారని చెప్పుకొచ్చాడు. ఇన్ని చలాన్లు ఇంటికి రావడంతో షాక్‌కు గురైన జాన్ బారెట్ అధికారులను సంప్రదించి, తన టెస్లా కారుకు రెసిడెంట్ రోడ్‌పై జరిమానాలు లేకుండా నడపడానికి అనుమతించే పర్మిట్ ఉందని, అందుకు విరుద్ధంగా జరిమానా విధించడం సబబుకాదని విన్నవించుకున్నాడు. వెంటనే చలానాలు తప్పుగా జారీ చేసినట్లు అధికారులు గుర్తించి, వాటన్నింటినీ రద్దు చేశారు. హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇది నిజంగానే జరిగింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా?
Also Read: