Russia Ukraine War: జో బైడెన్ యూరప్ టూర్‌తో హీటెక్కిన వార్.. బెలారస్ బోర్డర్ వరకూ అమెరికా సైన్యం..
రష్యా- ఉక్రెయిన్ వార్ ఇప్పటివరకూ ఒక ఎత్తు..! ఇక ఇప్పుడు మరో ఎత్తు..! యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో యూరప్ టూర్‌తో యుద్ధం మరింత హీటెక్కింది. పీఎస్ ఫోర్స్ ప్రకటనతో రష్యాకు నాటో వార్నింగ్ ఇచ్చినట్లైంది. అటు..
రష్యా- ఉక్రెయిన్ వార్(Russia Ukraine War) ఇప్పటివరకూ ఒక ఎత్తు..! ఇక ఇప్పుడు మరో ఎత్తు..! యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో యూరప్ టూర్‌తో యుద్ధం మరింత హీటెక్కింది. పీఎస్ ఫోర్స్ ప్రకటనతో రష్యాకు నాటో వార్నింగ్ ఇచ్చినట్లైంది. అటు బైడెన్ టూర్‌పై పుతిన్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ యుద్ధం కొత్త రూపం దాల్చనుందా..? ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. కీవ్‌ను ఆక్రమించేవరకూ తగ్గేదేలే..అంటోంది రష్యా. సర్వశక్తులు ఒడ్డుతోంది. ఐతే తామేం తక్కువ కాదంటోంది ఉక్రెయిన్. కీవ్‌లోకి అడుగుపెట్టిన రష్యా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్ ఆర్మీ. వార్ మొదలై సుమారు నాలుగు వారాలవుతున్నా..ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేకపోయామని రష్యా అంగీకరించింది. ఐతే టార్గెట్ రీచ్ అయ్యేవరకూ ట్రై చేస్తామంటోంది రష్యా. అటు భూ మార్గంలో రష్యా వార్‌షిప్‌ని యాక్టీవ్ చేసింది. ఉక్రెయిన్‌పై క్రూజ్ మిస్సైల్స్‌తో గగనతల దాడులు ఉధృతం చేసింది. ఉక్రెయిన్ పోర్టుతో అనుసంధానం ఉన్న నగరాలపై వార్‌షిప్ గురి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఉక్రెయిన్‌పై వెయ్యికిపైగా మిస్సైళ్లు రష్యా సంధించింది.
ఇది ఇలా ఉంటే….అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూరప్ టూర్‌తో వార్ హీటెక్కింది. బైడెన్ రాకతో పోలాండ్ నుంచి బెలారస్ బోర్డర్ వరకూ భారీగా అమెరికా సైన్యం మోహరించింది. అడుగడుగునా భద్రతను పర్యవేక్షిస్తోంది. ఉక్రెయిన్‌కి శాంతి దళాల్ని పంపేందుకు ఇప్పటికే బ్లూ ప్రింట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. మొదటి దశలో 10వేల మంది సైనికులను పంపే అవకాశం ఉంది. ఐతే బైడెన్ యూరప్ పర్యటనపై పుతిన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. spot….
మరోవైపు పీస్ ఫోర్స్ ప్రకటనతో రష్యాకు నాటో దళాలు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్లైంది. నాటోతో తాడోపేడో తేల్చుకోవడానికి పుతిన్ సిద్ధమైనట్లు సమాచారం. నార్వే సరిహద్దులో నాటో దళాల యుద్ధ కసరత్తు మొదలైంది. సుమారు 35 వేల మంది సైనికులు, ఫైటర్ జెట్స్, వార్‌షిప్‌తో సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. నాటో దళాల వార్ డ్రిల్‌పై రష్యాకు నార్వే అధికారిక సమాచారం అందించింది.
జో బైడెన్ యూరప్ పర్యటనపై ఫోకస్ పెట్టింది రష్యా. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు పుతిన్. ఉక్రెయిన్‌కి శాంతి దళాలు చేరితే..యుద్ధం కొత్త రూపం దాల్చే అవకాశం ఉందని రష్యా చెబుతోంది. పోలాండ్‌తోపాటు యూరప్ దేశాల అధ్యక్షులతో బైడెన్ జరిపే చర్చలు కీలకం కానున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా, మిత్ర దేశాలు అందించే సాయంపై చర్చించడానికే అని పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం పుతిన్ దూకుడు, అణుదాడి వంటి అంశాలపైనే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..
Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..