IPL 2022: ఆరెంజ్ క్యాప్ లిస్టులో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్.. అగ్రస్థానంలో ఉన్న బ్యాటర్లు వీరే..

ఐపీఎల్ ప్రారంభం నుంచే పరుగుల వర్షం కూడా మొదలుకానుంది. అయితే, ఐపీఎల్ ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్(Orange Cap) ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

IPL 2022: ఆరెంజ్ క్యాప్ లిస్టులో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్.. అగ్రస్థానంలో ఉన్న బ్యాటర్లు వీరే..
Ipl Orange Cap Winners List
Follow us

|

Updated on: Mar 23, 2022 | 1:13 PM

ఐపీఎల్ 2022 (IPL 2022) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ మార్చి 26న జరగనుంది. ఈ మ్యాచ్ గతేడాది విజేత చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ (CSK vs KKR) మధ్య జరగనుంది. కోవిడ్ కారణంగా మహారాష్ట్రలో మాత్రమే ఐపీఎల్ నిర్వహించనున్నారు. ముంబైలోని మూడు స్టేడియాలు, పుణెలోని ఒక స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో మ్యాచ్‌లు జరుగనుండగా, పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచే పరుగుల వర్షం కూడా మొదలుకానుంది. అయితే, ఐపీఎల్ ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్(Orange Cap) ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఇది మొదటి సీజన్‌తో మొదలై ఇప్పటి వరకు కొనసాగుతోంది. ప్రతి సీజన్ ముగిసే సమయానికి, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నిలిచిన వారికి ఈ టోపీని అందిస్తారు. ఈ క్యాప్ సీజన్ మధ్యలో కూడా ఇస్తారు. అయితే మ్యాచ్‌ల వారీగా మారుతూ ఉంటాయి. ఇప్పటివరకు, డేవిడ్ వార్నర్ ఈ క్యాప్‌ను అత్యధికంగా మూడుసార్లు గెలుచుకున్నాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ క్యాప్ గెలిచిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2008 నుంచి 2021 ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాళ్లు వీరే..

1. షాన్ మార్ష్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 616 పరుగులు, 2008

2. మాథ్యూ హేడెన్, చెన్నై సూపర్ కింగ్స్, 572 పరుగులు, 2009

3. సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్, 618 పరుగులు, 2010

4. క్రిస్ గేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 608 పరుగులు, 2011

5. క్రిస్ గేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 733 పరుగులు, 2012

6. మైఖేల్ హస్సీ, చెన్నై సూపర్ కింగ్స్, 733 పరుగులు, 2013

7. రాబిన్ ఉతప్ప, కోల్‌కతా నైట్ రైడర్స్, 2014

8. డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, 562 పరుగులు, 2015

9. విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 973 పరుగులు, 2016

10. డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, 641 పరుగులు, 2017

11. కేన్ విలియమ్సన్, సన్‌రైజర్స్ హైదరాబాద్, 735 పరుగులు, 2018

12. డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, 692 పరుగులు, 2019

13. కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్, 670 పరుగులు, 2020

14. రితురాజ్ గైక్వాడ్, చెన్నై సూపర్ కింగ్స్, 635 పరుగులు, 2021

ఈ ఏడాది 10 జట్లు..

ఈసారి ఐపీఎల్ కొత్త అవతార్‌లో కనిపించనుంది. గతంలో ఐపీఎల్‌ లీగ్‌లో ఎనిమిది జట్లు ఆడాయి. కానీ, ఈసారి 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ అనే రెండు కొత్త జట్లు చేరాయి. దీంతో ఆరెంజ్క్యాప్ కోసం పోటీదారులు కూడా పెరుగుతారనడంలో సందేహం లేదు. అలాగే మొదటిసారి లీగ్ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏ, గ్రూప్-బీ. రెండు గ్రూపుల్లో ఐదు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తన గ్రూప్‌లోని జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇతర గ్రూప్ జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది.

Also Read: IPL 2022: పర్పుల్ లిస్టులో చెన్నై సూపర్ కింగ్స్‌దే అగ్రస్థానం.. బౌలర్లలో ఎవరు ముందున్నారంటే?

IPL 2022: ఆరోసారి టైటిల్‌ వేటకు సిద్ధమైన రోహిత్ సేన.. బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!