IPL 2022: ఆరోసారి టైటిల్‌ వేటకు సిద్ధమైన రోహిత్ సేన.. బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

Mumbai Indians Preview: పోటీ ఎంత పెద్దదైనా సరే.. పోరు ఎంత జోరుగా ఉన్నా సరే.. అందులో గెలవాలంటే మంచి టీమ్‌తో పాటు గొప్ప లీడర్‌ ఉండటం కూడా చాలా ముఖ్యం. ఐపీఎల్ పోరులో ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద బలంగా నిలిచిందనడంలో సందేహం లేదు.

IPL 2022: ఆరోసారి టైటిల్‌ వేటకు సిద్ధమైన రోహిత్ సేన.. బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?
Ipl 2022 Mumbai Indians, Rohit Sharma
Follow us

|

Updated on: Mar 23, 2022 | 11:25 AM

పోటీ ఎంత పెద్దదైనా సరే.. పోరు ఎంత జోరుగా ఉన్నా సరే.. అందులో గెలవాలంటే మంచి టీమ్‌తో పాటు గొప్ప లీడర్‌ ఉండటం కూడా చాలా ముఖ్యం. ఐపీఎల్ పోరులో ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద బలంగా నిలిచిందనడంలో సందేహం లేదు. ముంబై టీంకు రోహిత్ శర్మ(Rohit Sharma) వంటి గొప్ప కెప్టెన్ ఉన్నాడు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)ను 5 సార్లు IPL ఛాంపియన్‌గా నిలిపాడు. లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా ఖ్యాతి గడించింది. కెప్టెన్సీ గురించి మనం మాట్లాడుకోకపోయినా, ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఇప్పుడు అలాంటి శక్తివంతమైన వ్యక్తి జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడే ముంబై ఇండియన్స్.. మరోసారి షేక్ చేసేందుకు సిద్ధమైంది. అంటే, ఐపీఎల్ 2022(IPL 2022) లో కూడా ఈ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.

రోహిత్ శర్మ నైపుణ్యం లేదా కెప్టెన్సీ కారణంగానే కాదు.. బలమైన ఆటగాళ్లు కూడా ముంబై టీంలో భాగమయ్యారు. అందుకే ముంబై ఇండియన్స్ అన్ని టీంలను ఓడించి, లోపాలను అధిగమించి 5-సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

ముంబై ఇండియన్స్ బలాలు..

IPL 2022లో ముంబై ఇండియన్స్ అతిపెద్ద బలం దాని బ్యాటింగ్. ‘హిట్‌మ్యాన్’ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. అతనికి మద్దతుగా ఇషాన్ కిషన్ ఉంటాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. ఇక మధ్యలో, ఈసారి జూనియర్ AB అంటే డెవోల్డ్ బ్రెవిస్ తుఫాన్ ఇన్నింగ్స్ ఈ ఏడాది వచ్చి చేరింది. ఈసారి వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు అండర్ 19 ప్రపంచకప్‌ను షేక్ చేసిన డెవోల్డ్ బ్రెవిస్‌ను చేర్చుకుంది.

ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్‌లోనూ బలంగానే కనిపిస్తోంది. ఈసారి ట్రెంట్ బౌల్ట్ లేకపోయినా, గాయం కారణంగా ఆర్చర్ ఈ సీజన్‌కు దూరమైనా.. జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మిల్స్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్ వంటి పేస్ ఎటాక్‌ను కలిగి ఉంది.

ముంబై ఇండియన్స్ బలహీనతలు..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బలహీనతల గురించి మాట్లాడితే, ఈ టీమ్‌కి ఈసారి కొన్ని లోపాలు ఉన్నాయి. ముంబై పేస్ అటాక్ బలంగా ఉండొచ్చు. కానీ, ఆల్‌రౌండర్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇది కాకుండా, ఐపీఎల్ 2022లో జట్టు స్పిన్ విభాగం కూడా బలహీనపడింది. ఇంతకుముందు కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. అయితే ఈసారి కాస్త అనుభవం లేని మయాంక్ మార్కండేయ, మురుగన్ అశ్విన్‌లు ఉన్నారు. ఆటగాళ్లకు గాయం అయితే, బ్యాకప్‌లోనూ ఎలాంటి ఎంపికలు లేకపోవడం కూడా ముంబై ఇండియన్స్ బలహీనతలుగా మారాయి.

ఈ లక్షణాలే ముంబై ఇండియన్స్‌ను మరోసారి ట్రోఫీకి చేరువగా..

మొత్తంమీద, కెప్టెన్సీలో రోహిత్ శర్మ అనుభవం, కీరన్ పొలార్డ్ శక్తి, జస్ప్రీత్ బుమ్రా యార్కర్‌లు IPL 2022లో ముంబై ఇండియన్స్‌కు అతిపెద్ద బలాలుగా మారాయి. ఇది కాకుండా, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి నూతన యోధులు బ్యాటింగ్‌లో జట్టుకు ఆయుధంగా నిరూపించనున్నారు. ఈ ఆటగాళ్లు మైదానంలోని ప్రతి మూలలో పరుగులు తీయడంలో నిష్ణాతులు.

ముంబై ఇండియన్స్ IPL 2022 స్క్వాడ్..

బ్యాట్స్‌మెన్స్- రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, అన్మోల్‌ప్రీత్ సింగ్

ఆల్ రౌండర్లు – కీరన్ పొలార్డ్, డానియన్ సామ్స్, సంజయ్ యాదవ్, టిమ్ డేవిడ్, ఫాబియన్ అలెన్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్

బౌలర్లు- జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, బాసిల్ థంపి

వికెట్ కీపర్- ఇషాన్ కిషన్, ఆర్యన్ జుయల్

స్పిన్నర్లు- మయాంక్ మార్కండేయ, మురుగన్ అశ్విన్

ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాఫ్..

మహేల జయవర్ధనే (ప్రధాన కోచ్), రాబిన్ సింగ్ (బ్యాటింగ్ కోచ్), షేన్ బాండ్ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), జేమ్స్ పేమెంట్ (ఫీల్డింగ్ కోచ్).

గత సీజన్‌లలో ముంబై ఇండియన్స్ స్థానం..

                                        సంవత్సరం                                టోర్నమెంట్‌లో ముంబై స్థానం
2008 5వ
2009 7వ
2010 రెండవ
2011 మూడవ
2012 నాల్గవ
2013 విజేత
2014 నాల్గవ
2015 విజేత
2016 5వ
2017 విజేత
2018 5వ
2019 విజేత
2020 విజేత
2021 5వ

ముంబై ఇండియన్స్ షెడ్యూల్..

Also Read: Watch Video: ‘ఇప్పుడు మీ వంతు’ అంటూ హల్‌చల్ చేస్తోన్న రాహుల్ సేన.. నెట్టింట్లో దూసుకెళ్తోన్న లక్నో..

IPL 2022: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ప్లేయర్.. 2 మ్యాచ్‌ల నుంచి సస్పెండ్.. ఎందుకో తెలుసా?

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
సూపర్ ఫాస్ట్ ల్యాప్‌టాప్ రిలీజ్ చేసిన లెనోవో
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీ ఇదే.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
రూ.1074కే జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్
రూ.1074కే జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్
అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్?
అతి తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు ఇవి.. ఏది బెస్ట్?