Watch Video: ‘ఇప్పుడు మీ వంతు’ అంటూ హల్‌చల్ చేస్తోన్న రాహుల్ సేన.. నెట్టింట్లో దూసుకెళ్తోన్న లక్నో..
IPL 2022, Lucknow Super Giants: ఐపీఎల్ 2022(IPL 2022)లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఈ సీజన్ కోసం జెర్సీ, థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ థీమ్ సాంగ్‌ను ప్రముఖ రాపర్ బాద్షా పాడారు.
ఐపీఎల్ 2022(IPL 2022)లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఈ సీజన్ కోసం జెర్సీ, థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ థీమ్ సాంగ్‌ను ప్రముఖ రాపర్ బాద్షా పాడారు. ‘ఇప్పుడు మీ వంతు’ అంటూ సాగుతోంది ఈ పాట. కాగా, ఈ థీమ్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మార్చి 26న జరగనుంది. అదే సమయంలో మార్చి 28న మరో కొత్త టీం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో లక్నో(GT vs LSG) తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.
లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ కనిపించనున్నాడు. రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన గౌతం గంభీర్ జట్టు మెంటార్ పాత్రలో కనిపించనున్నాడు. ఫ్రాంచైజీ తన ప్రధాన కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను నియమించింది.
లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, షాబాజ్ నదీమ్, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఐపీఎల్ 2022 లక్నో సూపర్‌జెయింట్స్ షెడ్యూల్..
మార్చి 28- vs గుజరాత్ టైటాన్స్ (రాత్రి 7.30)
మార్చి 31- vs చెన్నై సూపర్ కింగ్స్ (రాత్రి 7.30)
ఏప్రిల్ 4- vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7.30)
ఏప్రిల్ 7- vs ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి 7.30)
10 ఏప్రిల్- vs రాజస్థాన్ రాయల్స్ (రాత్రి 7.30)
16 ఏప్రిల్- vs ముంబై ఇండియన్స్ (మధ్యాహ్నం 3.30)
19 ఏప్రిల్- vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాత్రి 7.30)
24 ఏప్రిల్- vs ముంబై ఇండియన్స్ (రాత్రి 7.30)
29 ఏప్రిల్- vs పంజాబ్ కింగ్స్ (రాత్రి 7.30)
మే 1 vs ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3.30)
మే 7- vs కోల్‌కతా నైట్ రైడర్స్ (రాత్రి 7.30)
మే 10- vs గుజరాత్ టైటాన్స్ (పూణె – రాత్రి 7.30)
మే 15- vs రాజస్థాన్ రాయల్స్ (రాత్రి 7.30)
మే 18- vs కోల్‌కతా నైట్ రైడర్స్ (రాత్రి 7.30)
The moment you’ve been waiting for! Poori taiyaari hai… Ab Apni Baari Hai!!! ? ??#AbApniBaariHai
YouTube: https://t.co/OQYOThajgQ@rpsggroup @Its_Badshah @remodsouza @klrahul11 @GautamGambhir #LucknowSuperGiants #TataIPL #LSG2022 #T20 #Cricket #UttarPradesh #Lucknow
— Lucknow Super Giants (@LucknowIPL) March 22, 2022
Also Read: IPL 2022: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ప్లేయర్.. 2 మ్యాచ్‌ల నుంచి సస్పెండ్.. ఎందుకో తెలుసా?
IPL 2022, MI vs DC: రోహిత్ సేనకు ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌కు దూరమైన యంగ్ బ్యాట్స్‌మెన్..