IPL 2022: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ప్లేయర్.. 2 మ్యాచ్‌ల నుంచి సస్పెండ్.. ఎందుకో తెలుసా?
బయో-బబుల్‌ని కారణంగా చూపిస్తూ.. ఐపీఎల్ 2022 (IPL 2022) నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ ప్లేయర్‌కు ఇంగ్లండ్ బోర్డ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు, 2500 యూరోల జరిమానా కూడా విధించింది.
ఓపెనర్ జాసన్ రాయ్(Jason Roy)పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (England Cricket Team) రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. జాసన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను బయో-బబుల్‌ని కారణంగా చూపిస్తూ.. ఐపీఎల్ 2022 (IPL 2022) నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ ప్లేయర్‌కు ఇంగ్లండ్ బోర్డ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు, 2500 యూరోల జరిమానా కూడా విధించింది. ఈసీబీ ప్రకటనలో,’క్రికెట్ క్రమశిక్షణా కమిటీ జాసన్ రాయ్‌పై తన నిర్ణయాన్ని ప్రకటించింది. క్రికెట్‌కు, ఈసీబీకి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించాడని, ఈ కారణంగా జాసన్‌పై ఇలాంటి నిర్ణయం వెల్లడైంది. అయితే, ఈ ఆరోపణలను జాసన్ రాయ్ కూడా అంగీకరించాడని, జాసన్ ECB రూల్ 3.3ని ఉల్లంఘించాడు’ అని పేర్కొంది.
ఈమేరకు జాసన్ ఇంగ్లాండ్ తరపున తదుపరి రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ సస్పెన్షన్ 12 నెలలు ఉంటుంది. కాగా, ఇది కూడా ఆయన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా అతనికి 2,500 యూరోల జరిమానా విధించారు. అతను ఈ జరిమానాను 31 మార్చి 2022 లోపు చెల్లించవలసి ఉంటుంది.
IPL 2022, MI vs DC: రోహిత్ సేనకు ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌కు దూరమైన యంగ్ బ్యాట్స్‌మెన్..