- Telugu News Photo Gallery Cricket photos Pakistan vs Australia: Ausies Player Steve Smith Surpasses Kumar Sangakkara and Sachin Tendulkar To Script World Record against Australia test series
PAK vs AUS: ప్రపంచ రికార్డుకు 7 పరుగుల దూరం.. సచిన్-సంగక్కరను వెనక్కు నెట్టనున్న ఆసీస్ స్టార్ ప్లేయర్
Steve Smith: లాహోర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 59 పరుగులు చేసి భారీ రికార్డు సృష్టించాడు.
Updated on: Mar 23, 2022 | 8:08 AM

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మాదిరిగానే ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పరుగుల కరవు కొనసాగుతోంది. అయినా తన బ్యాట్‌తో రికార్డులు సృష్టించడం మాత్రం తగ్గలేదు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఈ స్టార్ ఆటగాడు మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

లాహోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 59 పరుగులు చేశాడు. 169 బంతులు ఆడిన స్మిత్.. నసీమ్ షా వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. స్మిత్ టెస్టు కెరీర్‌లో ఇది 150వ ఇన్నింగ్స్. 150 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు.

స్మిత్ 150 ఇన్నింగ్స్‌ల్లో 60.10 సగటుతో 7993 పరుగులు చేశాడు. ఈ విషయంలో అతను శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వదిలిపెట్టాడు. సంగక్కర 150 ఇన్నింగ్స్‌ల్లో 7913 పరుగులు చేశాడు. సంగక్కరతో పాటు, 150 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 7869 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్‌ను కూడా స్మిత్ వెనక్కునెట్టాడు.

స్టీవ్ స్మిత్ టెస్టు కెరీర్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులకు చేరువలో ఉన్నాడు. అతను 150 ఇన్నింగ్స్‌లలో 7993 పరుగులు చేశాడు. ఇప్పుడు అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 8000 పరుగులు సాధించడానికి కేవలం ఏడు పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు 152 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన సంగక్కర పేరిట ఉంది. సచిన్ 154 మ్యాచ్‌ల్లో 8000 పరుగులు పూర్తి చేయగా, కోహ్లీ 169 ఇన్నింగ్స్‌ల్లో 8000 పరుగులు పూర్తి చేశాడు.




