- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 These bowlers are most maiden overs in indian premier league history praveen kumar bhuvneshwar kumar
IPL 2022: IPL 2022: ఈ బౌలర్ల రూటే సపరేటు.. బాల్ వేస్తే, బ్యాటర్ గమ్మునుండాల్సిందే.. ఆ స్పెషల్ రికార్డుల్లో ఎవరున్నారంటే?
ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చూపిస్తున్నా.. ఈ టోర్నీలో బౌలర్లు కూడా తమదైన ముద్ర వేశారు. మెయిడిన్ ఓవర్లు వేయడంలో వీరు సిద్ధహస్తులుగా మారారు.
Updated on: Mar 22, 2022 | 9:26 AM

మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉత్కంఠ మొదలుకానుంది. ఈ పొట్టి లీగ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే సంగతి తెలిసిందే. ఇక్కడ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించినా.. కొందరు బౌలర్లు మాత్రం తగ్గేదేలే అంటూ తమ సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో బౌలర్లు కూడా రెచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ లీగ్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన అలాంటి కొంతమంది బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా ప్రవీణ్ కుమార్ రికార్డు సృష్టించాడు. ప్రవీణ్ 119 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మొత్తం 14 మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ చేశాడు. ప్రవీణ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్), గుజరాత్ లయన్స్ వంటి జట్ల తరపున ఆడాడు. ప్రస్తుతం రిటైరయ్యాడు.

ఇర్ఫాన్ పఠాన్ రెండో స్థానంలో ఉన్నాడు. పఠాన్ 103 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్ ఓవర్లు వేశాడు. పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లలో పఠాన్ భాగమయ్యాడు. ప్రస్తుతం వ్యాఖ్యానంతో బిజీగా ఉన్నాడు.

ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ పేరు మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న భువనేశ్వర్ 132 మ్యాచ్‌ల్లో తొమ్మిది మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఈ సీజన్‌లో అతను రెండో స్థానంలో చేరే అవకాశం ఉంది.

ధావల్ కులకర్ణి, లసిత్ మలింగ, సందీప్ శర్మ ఐపీఎల్‌లో ఎనిమిది మెయిడిన్ ఓవర్లు విసిరారు. ఈ సీజన్‌లో ధావల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే మలింగ రిటైర్మెంట్‌ను తీసుకున్నాడు. సందీప్ శర్మ ఈ ఎనిమిది సంఖ్యను దాటే ఛాన్స్ ఉంది.

ఈ ముగ్గురి తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్ 95 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఏడు మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ కోచ్‌గా స్టెయిన్‌ను నియమించడంతో ఈ ఏడాది స్టెయిన్ కోచ్ పాత్రలో ఉంటాడు.




