- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 most sixes by wicket keeper in indian premier league ms dhoni kl rahul rishabh pant
IPL 2022: ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్లు.. లిస్టులో ఎవరున్నారంటే?
IPL 15వ సీజన్‌కు ముందు లీగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 23, 2022 | 2:28 PM

IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. IPL 15వ సీజన్‌కు ముందు లీగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ల గురించి మాట్లాడితే, ఎంఎస్ ధోనీ నంబర్ స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోని ఐపీఎల్‌లో 214 సిక్సర్లు కొట్టాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో కేఎల్ రాహుల్(109) రెండో స్థానంలో ఉన్నాడు.

రిషబ్ పంత్ 107 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో దినేష్ కార్తీక్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 105 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో కేవలం నలుగురు వికెట్‌కీపర్లు మాత్రమే 100 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టారు.




