AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: పర్పుల్ లిస్టులో చెన్నై సూపర్ కింగ్స్‌దే అగ్రస్థానం.. బౌలర్లలో ఎవరు ముందున్నారంటే?

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు సీజన్ ముగింపులో పర్పుల్ క్యాప్ ఇవ్వనున్న సంగతి తెలసిందే. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతోంది.

IPL 2022: పర్పుల్ లిస్టులో చెన్నై సూపర్ కింగ్స్‌దే అగ్రస్థానం.. బౌలర్లలో ఎవరు ముందున్నారంటే?
Ipl Purple Cap Winners
Venkata Chari
|

Updated on: Mar 23, 2022 | 12:26 PM

Share

ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ లీగ్‌లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్ బాల్, బ్యాటింగ్ ప్రతిభకు కొత్త కోణాలను అందించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కీలకమైన ఆటగాళ్లను భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి అందించింది. లీగ్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫార్మాట్‌లో పరుగుల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ లీగ్‌లో బౌలర్లు కూడా తమలో ఉన్న ప్రతిభను బయటలకు తీసి, ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బంతితో ఎన్నో మ్యాచులను మలుపుతిప్పిన సంఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇలాంటి ప్రతిభ చూపిన వారికి IPLలో మంచి గుర్తింపు లభిస్తుంది. సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్(Purple Cap) ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మొదటి ఎడిషన్ అంటే 2008 నుంచి పర్పుల్ క్యాప్ ఇచ్చే ట్రెండ్ కొనసాగుతోంది. లీగ్ ముగింపులో ఎక్కువగా వికెట్లు పడగొట్టిన బౌలర్ తలపై ఈ టోపీని ఉంచుతారు. ఈ సమయంలో, లీగ్ సమయంలో కూడా క్యాప్ ఇస్తుంటారు. కానీ అది మ్యాచ్‌ని బట్టి మారుతుంది. ప్రతి మ్యాచ్ తర్వాత, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు నంబర్-1 స్థానంలో నిలుస్తుంటాడు. ఇప్పటివరకు ఈ క్యాప్ ఎంతమంది దక్కించుకున్నారో ఓసారి చూద్దాం.

2008 నుంచి 2021 వరకు పర్పుల్ క్యాప్ గెలిచిన బౌలర్లు వీరే..

1. సోహైల్ తన్వీర్, రాజస్థాన్ రాయల్స్, 22 వికెట్లు, 2008

2. ఆర్‌పీ సింగ్, డెక్కన్ ఛార్జర్స్, 23 వికెట్లు, 2009

3. ప్రజ్ఞాన్ ఓజా, డెక్కన్ ఛార్జర్స్, 21 వికెట్లు, 2010

4. లసిత్ మలింగ, ముంబై ఇండియన్స్, 28 వికెట్లు, 2011

5. మోర్నే మోర్కెల్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, 25 వికెట్లు, 2012

6. డ్వేన్ బ్రావో, చెన్నై సూపర్ కింగ్స్, 32 వికెట్లు, 2013

7. మోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్, 23 వికెట్లు, 2014

8. డ్వేన్ బ్రావో, చెన్నై సూపర్ కింగ్స్, 26 వికెట్లు, 2015

9. భువనేశ్వర్ కుమార్, సన్‌రైజర్స్ హైదరాబాద్, 23 వికెట్లు, 2016

10. భువనేశ్వర్ కుమార్, సన్‌రైజర్స్ హైదరాబాద్, 26 వికెట్లు, 2017

11. ఆండ్రూ టై, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 24 వికెట్లు, 2018

12. ఇమ్రాన్ తాహిర్, చెన్నై సూపర్ కింగ్స్, 26 వికెట్లు, 2019

13. కగిసో రబాడ, ఢిల్లీ క్యాపిటల్స్, 30 వికెట్లు, 2020

14. హర్షల్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 32 వికెట్లు, 2021

అగ్రస్థానంలో బ్రావో, భువనేశ్వర్..

పర్పుల్ క్యాప్ ఎక్కువగా అందుకున్న లిస్టులో చెన్నైకి చెందిన బ్రావో, సన్‌రైజర్స్‌కు చెందిన భువనేశ్వర్ కుమార్ ముందంజలో ఉన్నారు. వీరిద్దరూ ఈ క్యాప్‌ను రెండుసార్లు గెలుచుకున్నారు. అయితే టీం ప్రకారం చూస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో నిలిచింది. ఈ జట్టు ఆటగాళ్లు నాలుగు సార్లు ఈ క్యాప్‌ను దక్కించుకున్నారు.

Also Read: IPL 2022: ఆరోసారి టైటిల్‌ వేటకు సిద్ధమైన రోహిత్ సేన.. బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

Watch Video: ‘ఇప్పుడు మీ వంతు’ అంటూ హల్‌చల్ చేస్తోన్న రాహుల్ సేన.. నెట్టింట్లో దూసుకెళ్తోన్న లక్నో..