CSK New Captain: ధోనీ వారసులుగా వీరైతేనే బెటర్: సీఎస్‌కే కొత్త సారథిపై రైనా కీలక వ్యాఖ్యలు..

IPL 2022: ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాదిలో ధోని తప్పుకునే ఛాన్స్ ఉండడంతో..

CSK New Captain: ధోనీ వారసులుగా వీరైతేనే బెటర్: సీఎస్‌కే కొత్త సారథిపై రైనా కీలక వ్యాఖ్యలు..
Ipl 2022 Chennai Super Kings, Ms Dhoni
Follow us

|

Updated on: Mar 23, 2022 | 1:53 PM

ఐపీఎల్‌లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఒక్క ఆటగాడిని మాత్రమే కెప్టెన్‌గా కొనసాగించిన ఏకైక జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) నిలిచింది. చెన్నై టీంలో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) అంతలా పాతుకపోయాడు మరి. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. త్వరలో ఐపీఎల్‌(IPL)కి కూడా ధోనీ గుడ్‌బై చెప్పనున్నాడని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే ధోని తర్వాత ఈ సింహాసనాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనేది ఇంకా ఖరారు కాలేదు. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సురేశ్ రైనా.. ఈ ప్రశ్నకు సమాధానం అందించాడు. ధోనీ స్థానంలో ఎవరు పోటీ చేస్తారో పేర్కొన్నాడు. రైనా ఈ ఏడాది ఐపీఎల్‌లో భాగం కాలేదు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేయకపోవడంతో, ఆ తరువాత జరిగిన మెగా వేలంలోనూ ఏ జట్టు కూడా కొనలేదు. దీంతో అన్‌సోల్డ్ లిస్టులో ఉండిపోయాడు.

కెప్టెన్‌గా ఎవరంటే?

మహేంద్ర సింగ్ ధోనీ 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చెన్నైకి కెప్టెన్‌గా ఉన్నాడు. ఆయన ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే, ధోని తర్వాత జట్టు బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు. IPL 2022కి ముందు స్టార్ స్పోర్ట్స్‌తో సంభాషణ సందర్భంగా, రైనా మాట్లాడుతూ, ‘రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో రాబోయే కాలంలో జట్టుకు కెప్టెన్‌గా ఉండగలరు. వారందరూ సమర్థులు. ఆటను బాగా అర్థం చేసుకుంటారు. వచ్చే సీజన్‌లో ఈ ఆటగాళ్లలో ఎవరైనా ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలరు. ధోనీ కెప్టెన్సీలో రైనా సీఎస్‌కే వైస్ కెప్టెన్‌గా ఉండేవాడు. ధోనీ, రైనా మధ్య ఎంతో స్నేహం ఉండేది. CSK అభిమానులు ధోనిని తాలా అని పిలుస్తుంటే, రైనాను చిన్న తాలా అని పిలుస్తుంటారు.

కామెంటేటర్‌గా కనిపించనున్న సురేశ్ రైనా..

ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా అరంగేట్రం గురించి అడిగినప్పుడు, వ్యాఖ్యానించడం నిజంగా కష్టమని చెప్పాడు. అందుకు నేను సిద్ధమేనని చెప్పాడు. నా స్నేహితులు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా ఇప్పటికే ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో రవిశాస్త్రి కూడా నాతోపాటు ఉంటారు. కనుక ఇది నాకు తేలికగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను నా స్నేహితుల నుంచి చిట్కాలను తీసుకుంటూ ముందుకుసాగుతాను అంటూ వెల్లడించాడు.

Also Read: ICC Women ODI Rankings: వన్డే ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన మంధాన-భాటియా.. భారత సారథికి మాత్రం నిరాశే..

IPL 2022: ఆరెంజ్ క్యాప్ లిస్టులో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్.. అగ్రస్థానంలో ఉన్న బ్యాటర్లు వీరే..