Telangana Election: సీఈఓ వికాస్ రాజ్ జిల్లా పర్యటనలు….అధికారుల్లో గుబులు?
Telangana Election: జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్. మొన్న మహబూబ్ నగర్, నిన్న ఆదిలాబాద్, ఇవ్వాళ కరీంనగర్ లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో రహస్య పర్యటనలు చేస్తూ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ECI ఆదేశాలను జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్. మొన్న మహబూబ్ నగర్, నిన్న ఆదిలాబాద్, ఇవ్వాళ కరీంనగర్ లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో రహస్య పర్యటనలు చేస్తూ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ECI ఆదేశాలను జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిబధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు సీఈఓ.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తున్న వేళ వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు సీఈఓ వికాస్ రాజ్. నోటిఫకేషన్ వచ్చే లోపు రాష్ట్రంలోని సమస్యాత్మక జిల్లాలతో పాటు ఉమ్మడి పది జిల్లాల పర్యటన చేసేలా షెడ్యూల్ వేసుకున్నారు సీఈఓ. ఇందులో భాగంగా దసరాకి ముందు దక్షిణ తెలంగాణ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దసరా తరవాత అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లా అధికారులు ఏర్పాట్ల పై సీఈఓ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం సీఈఓ అధికారులకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. ఎన్నికలలో డబ్బు, మద్యం అరికట్టేందుకు ఎఫ్ ఎస్ టి కదలికలు చాలా ముఖ్యమని, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి బృందాల కెమెరాలకు అనుసంధానం చేయాలని చెప్పారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి ఓటరు గుర్తింపు కార్డులు సక్రమంగా ప్రింట్ వచ్చేలా పునః పరిశీలన చేసుకోవాలని సీఈవో కలెక్టర్లను ఆదేశించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సువిధ యాప్ ద్వారా అన్ని అనుమతులు ఒకే చోట ఇవ్వాలని, ఎన్నికల సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దాలని సూచిస్తున్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని గ్రామాల నుండి పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయా పోస్టులు ఖాళీ లేకుండా చూసుకోవాలని, నామినేషన్ల సందర్భంగా రిటర్నింగ్ అధికారుల ఛాంబర్లు సరిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు, నియోజకవర్గాలలో శాంతిభద్రతల పరిస్థితి, పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాల కల్పన, మహిళా పోలింగ్ కేంద్రాలు, పీడబ్ల్యుడి పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల ర్యాండమైజేషన్, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఎన్నికల సందర్భంగా ఉత్పన్నమయ్యే శాంతి భద్రతల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం పై సీఈవో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
సీఈవో పర్యటన కు వస్తున్నారన్న…ECI నుంచి ఏమైనా ఫోన్, ఈమెయిల్ వచ్చిందన్నా కలెక్టర్, పోలీస్ సూపరిండెంట్‌తో పాటు జిల్లా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులంతా భయంతో వణుకుతున్నారు. CEO పర్యటన సందర్భంగా ఎదైనా ఇబ్బంది అయినా ఏర్పాట్లు సరిగ్గా లేకుండా సీఈవో చర్యలు అయినా ఉంటాయి. లేదా ECI నుంచి అయినా ఉంటాయనే అభిప్రాయంతో ఉన్నారు. ఎప్పుడైతే ఒకేసారి 20మంది అధికారులపై వేటు వేసిందో, అప్పటి నుంచి అధికారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ECI రూల్స్ కు పాటించకున్నా నిబధనలు అమలు చేయకపోతే యాక్షన్ తప్పదనే సందేశాన్ని పంపుతోంది ECI.
అధికారుల పై వేటు సెకండ్ లిస్ట్ రెఢీ అయిందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. వారం క్రితం టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్, నిన్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ కలెక్టర్ పై బదిలీ వేటు వేశారు. రానున్న రోజుల్లో మరింత మందిపై కూడా దశలవారీగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరి ఈ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఎంతమంది ECI వేటుకు గురి అవుతారో చూడాలి మరి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
