Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad DEO Office: అమ్మో..డీఈవో ఆఫీస్‌కా..! ఆ రూంకి మాత్రం అస్సలు వెళ్లవద్దు..

ఆదిలాబాద్ డీఈవో కార్యాలయాన్ని దెయ్యం భయం వెంటాడుతోంది. అర్థరాత్రి‌దాటగానే డీఈవో ఆపీస్ లోని ఓ రూం నుండి వింత శబ్దాలు వస్తుండటం.. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వింత ఆకారాలు కనిపించడం.. చర్చణీయాంశంగా మారింది. ఈ విషయం ఈనోట ఆ నోట బయటకి పొక్కడంతో రాత్రి ఆ వైపున వెళ్లాలంటేనే జనం దడుచుకునే పరిస్థితి ఏర్పడింది. అలా అని ఈ కార్యాలయం ఎక్కడో శివారులో లేదు. ఆదిలాబాద్ పట్టణం కేంద్రం నడిబొడ్డున వన్ టౌన్ పోలీసు..

Adilabad DEO Office: అమ్మో..డీఈవో ఆఫీస్‌కా..! ఆ రూంకి మాత్రం అస్సలు వెళ్లవద్దు..
Adilabad DEO office
Follow us
Naresh Gollana

| Edited By: Srilakshmi C

Updated on: Oct 29, 2023 | 12:53 PM

ఆదిలాబాద్, అక్టోబర్ 29: ఆదిలాబాద్ డీఈవో కార్యాలయాన్ని దెయ్యం భయం వెంటాడుతోంది. అర్థరాత్రి‌దాటగానే డీఈవో ఆపీస్ లోని ఓ రూం నుండి వింత శబ్దాలు వస్తుండటం.. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వింత ఆకారాలు కనిపించడం.. చర్చణీయాంశంగా మారింది. ఈ విషయం ఈనోట ఆ నోట బయటకి పొక్కడంతో రాత్రి ఆ వైపున వెళ్లాలంటేనే జనం దడుచుకునే పరిస్థితి ఏర్పడింది. అలా అని ఈ కార్యాలయం ఎక్కడో శివారులో లేదు. ఆదిలాబాద్ పట్టణం కేంద్రం నడిబొడ్డున వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉంది ఈ కార్యాలయం. అయితే ఈకార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతం ఉండటం గతంలో ఆ ప్రాంతంలో ఓ హత్య జరగడం.. అలా చనిపోయిన వ్యక్తి ఆత్మే ఇలా సంచరిస్తుందన్న ప్రచారం డీఈవో కార్యాలయ సిబ్బందిని మరింత వణికిస్తోంది.

తాజాగా ఓపెన్ స్కూల్ పరీక్షల జవాబుపత్రాలు భద్రపర్చిన డీఈవో కార్యాలయంలో ఓ ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లకు డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీకి వచ్చిన ఓ కానిస్టేబుల్ కు డీఈవో కార్యాలయంలోని ఓ రూం నుండి వింత శబ్దాలు వినిపించాయి.. దీంతో అలర్ట్ అయిన ఆ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా ఎవరు కనిపించలేదు. అక్కడే వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని ఆ కానిస్టేబుల్ ఆరా తీయడంతో ఇలాంటి శబ్దాలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయని.. దెయ్యం ఉందని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ లోను భయం మొదలైంది. వెంటనే ఆ కానిస్టేబుల్ తన తోటి కానిస్టేబుల్స్ కు చెప్పడం ఆ వార్త దాహనంలా అంతటా వ్యాపించడంతో.. అమ్మో డీఈవో ఆపీస్.. ఈ ఆఫీస్‌లో ఆ రూంకి అస్సలు వెళ్ల వద్దనే ప్రచారం ఎక్కువైంది‌‌.

దెయ్యం భయంతో ఓ ఉద్యోగి ఓ భూత వైద్యుడిని సంప్రదించగా.. అక్కడికి చేరుకున్న ఆ భూత వైద్యుడు సైతం దెయ్యం ఉందని చెప్పడంతో ఆ డీఈవో కార్యాయల ఉద్యోగుల భయం పదింతలైంది. ఈ విషయం తెలుసుకున్న డీఈవో.. ఉద్యోగుల్లో భయాన్ని పోగెట్టేందుకు జన విజ్ఞాన వేదిక సభ్యులను కార్యాలయానికి రప్పించి.. రాత్రంతా అదే రూంలో బస చేసేలా ఏర్పాట్లు చేసి దెయ్యం లేదని నిరూపించడంతో ఊపిరి పీల్చుకున్నారు వారంత. అయితే అదే రాత్రి డీఈవో కార్యాలయంలోని మహిళల బాత్రూంలో మరుగుదొడ్డి పగిలి పోవడంతో ఆ భయం మళ్లీ మొదలైంది. బండరాయి పై నుండి పడటంతో ఆ మరుగుదొడ్డి పగిలిపోయిందని జన విజ్ఞాన వేదిక సభ్యులు చెప్పినా ఉద్యోగుల్లో మాత్రం భయం ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు