తమలపాకును ఇలా తింటే విషంతో సమానం… ఈ అలవాటు మానకుంటే ఆ వ్యాధి గ్యారెంటీ..
తమలపాకు గురించి చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తాంబూలమే. భారతీయులకు తాంబూల సేవనం ఎప్పటినుంచో ఉన్న అలవాటు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. కొన్ని రకాల మొండి వ్యాధుల నుంచి కూడా తమలపాకు కాపాడుతుంది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యం ఉంది. అయితే తమలపాకును పాన్ రూపంలో తీసుకుంటే మాత్రం అది ప్రాణాంతక వ్యాధులను కలిగిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

తమలపాకులో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ ఇ ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, అయోడిన్, పాస్ఫరస్, ఐరన్, అమైనోయాసిడ్స్, ఎంజైమ్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీ రోల్ పోషిస్తాయి. అయితే, ఈ ఆకుల్ని మనం సరైన విధంగా తీసుకోవడం తెలియకపోతే ఇవి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా యువత తమలపాకుతో చేసే పాన్ ను తింటుంటారు. ఈ ఆకులో వివిధ పదార్థాలు కలపడం వల్ల ఎన్ని సమస్యలో తెలుసుకోండి..
ఇప్పటికే షుగర్ ఉన్నవారు తమలపాకుతో చేసే పాన్ ను తీసుకోకూడదు. చాలా మంది షుగర్ ఉన్నప్పటికీ కిళ్లీ వేసుకునే అలవాటును కొనసాగిస్తుంటారు. మీరు ఎన్ని డైట్లు మెయింటైన్ చేసినప్పటికీ పాన్ వేసుకునే అలవాటు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాన్ వేసుకోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి అని పలు పరిశోధనలు చెప్తున్నాయి. ఇందులో వాడే వక్కల వల్ల ఊబకాయం సమస్య కూడా వస్తుందంటున్నారు. దీంతో అది నడుం చుట్టూ కొవ్వును పెంచేస్తుంది.
ఒకవేళ ఇప్పటికే షుగర్ ఉన్నవారు ఈ అలవాటును మానలేకపోతుంటే మానసిక నిపుణుల సలహా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది మరిన్ని సమస్యలకు కారణమవుతుంది.
తమలపాకు మీద రాసే సున్నం మోతాదు మించితే అనేక అనర్థాలను కలిగిస్తుంది. దీని కారణంగా సున్నం ఎక్కువైతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.
వక్కల కారణంగా తలెత్తే రిస్కులు ఎన్నో విధాలుగా శరీరాన్ని పాడుచేస్తాయి. ఇవి ఎక్కువకాలం తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు కారణం అవుతాయి. వీరిలో విటమిన్ డి స్థాయిలు చాలా తక్కువకు పడిపోతాయి. ఫలితంగా ఎముకలు పెలుసుబారుతాయి. మానసిక సమస్యల బారిన పడతారు.
దీనికి బదులుగా మనం తమలపాకుల్ని నేరుగా నమిలి తీసుకోవచ్చు. తాజా ఆకుల్ని తీసుకుని నమిలితే నోటిలోని దుర్వాసన తగ్గుతుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీనిని నమలడం వల్ల సలైవా రిలీజ్ అవుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ స్టిమ్యులేట్ అయి జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
తమలపాకుల్లో థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి, కెరోటిన్ వంటి గుణాలు మనకి చాలా విధాలుగా మంచి చేస్తాయి. వీటిని నేరుగా నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.




