నాగర్‌కర్నూల్‌లో విషాదం.. నలుగురు బిడ్డలతో సహా కాలువలో దూకి తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..
మంగనూరు గ్రామానికి చెందిన సరబండ వాసురాం, లలిత దంపతులు. వీరికి మహాలక్ష్మి (5), చరిత (4), మంజుల (3), ఏడు నెలల వయసున్న మారు కొండయ్య అనే నలుగురు సంతానం. పది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం (సెప్టెంబర్ 16) బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తన నలుగురు పిల్లలతో తల్లి లలిత వేళ్లింది. అనంతరం ఏం జరిగింతో తెలియదు అక్కడి నుంచి నేరుగా బిజినపల్లి సమీపంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ వద్దకు వెళ్లి తన నలుగురు పిల్లలను ఒకరి తర్వాతర ఒకరిని కాలువలోకి..

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 17: ఏ కష్టం వచ్చిందో తెలియదు.. ఓ తల్లి తన నలుగురు బిడ్డలను కాలువలోకి తోసి తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా, నాలుగో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో శనివారం (సెప్టెంబర్ 16) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంగనూరు గ్రామానికి చెందిన సరబండ వాసురాం, లలిత దంపతులు. వీరికి మహాలక్ష్మి (5), చరిత (4), మంజుల (3), ఏడు నెలల వయసున్న మారు కొండయ్య అనే నలుగురు సంతానం. పది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం (సెప్టెంబర్ 16) బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తన నలుగురు పిల్లలతో తల్లి లలిత వేళ్లింది. అనంతరం ఏం జరిగింతో తెలియదు అక్కడి నుంచి నేరుగా బిజినపల్లి సమీపంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ వద్దకు వెళ్లి తన నలుగురు పిల్లలను ఒకరి తర్వాతర ఒకరిని కాలువలోకి తోసేసింది. అనంతరం తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లీబిడ్డల కోసం గాలింపు చర్యలకు పూనుకున్నారు. ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా, నాలుగో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీసధికారి తెలిపారు.
నీలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కోసం గాలింపు
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాపైన ఆరు నెలల చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బాడుడి ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోన్న అక్కడ సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు అభించలేదు. శనివారం పలువురు మహిళా అనుమానితులను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నాయి. అయితే తప్పిపోయిన చిన్నారి గురించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు. మరోవైపు తమ బిడ్డను సురక్షితంగా అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు చిన్నారి తల్లి తెలిపారు. కాగా గురువారం మధ్యాహ్నం ఆహారం కోసం చిన్నారి తల్లి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




