Khammam: ‘అమ్మా’ నీ ప్రేమకు ఎవరూ సాటిరారు.. అరవై ఏళ్లుగా కన్న బిడ్డలకు సపర్యలు చేస్తోన్న తల్లి!
ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టుకకు ఓ తల్లి కారణం. జన్మనిచ్చిన ప్రేమమూర్తి బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. అమ్మా అనే పదంలో ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత ఎంత చెప్పినా మాటలకు అందని గొప్పతనం ఆమెది. అందుకే ఆమె ప్రేమ అమృత తుల్యం అని కవులు తమ కవితల్లో వర్ణిస్తుంటారు. చెట్టుకు ఫలాలు భారం కాదనే మాట వినే ఉంటారు. అలాగే ఏ తల్లికైనా తన కన్న బిడ్డలు భారంకారు. పుట్టిన వాళ్లు ఎలా ఉన్నాఆమెలోని మాతృ హృదయం వారిని స్వీకరిస్తుంది. తాజాగా ఓ తల్లి చేస్తున్న పని ఈ విషయాన్ని మరోమారు రుజువు చేసింది. ఎనబై పదుల వయసులో తన..

ఖమ్మం, సెప్టెంబర్ 17: ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టుకకు ఓ తల్లి కారణం. జన్మనిచ్చిన ప్రేమమూర్తి బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. అమ్మా అనే పదంలో ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత ఎంత చెప్పినా మాటలకు అందని గొప్పతనం ఆమెది. అందుకే ఆమె ప్రేమ అమృత తుల్యం అని కవులు తమ కవితల్లో వర్ణిస్తుంటారు. చెట్టుకు ఫలాలు భారం కాదనే మాట వినే ఉంటారు. అలాగే ఏ తల్లికైనా తన కన్న బిడ్డలు భారంకారు. పుట్టిన వాళ్లు ఎలా ఉన్నాఆమెలోని మాతృ హృదయం వారిని స్వీకరిస్తుంది. తాజాగా ఓ తల్లి చేస్తున్న పని ఈ విషయాన్ని మరోమారు రుజువు చేసింది. ఎనబై పదుల వయసులో తన అరవై ఏళ్ల కొడుకులను చంటి పిల్లల్లా సపర్యలు చేస్తోంది. వైకల్యంతో పుట్టిన తన ఇద్దరు బిడ్డలను కాదనుకోలేకపోయింది. అందుకే మనవ సంతానంతో కాలక్షేపం చేయవల్సిన వయసులో కొడుకులకు అన్నీ తానై కాపాడుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన ఈ తల్లి కథ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన చాపలమడుగు దానమ్మ వయసు 82 ఏళ్లు. వృద్ధాప్యం మీదపడటంతో ఆమె ఒంట్లో సత్తువ ఉడికిపోయి, నడుం వాలిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులా ఉంది. కానీ ఆమె తన శక్తినంతా కూడగట్టుకుని కదలలేని తన ఇద్దరు కుమారులకు ఏకైక దిక్కుగా మారింది. ఆమెకు భూషి (67), దశరథ (40) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు పుట్టినప్పటి నుంచీ కదలలేని స్థితిలో ఉన్నారు. అంటే వారు పుట్టుకతోనే దివ్యాంగులు. మూడో నాలుగో సంతానంగా ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఐదో సంతానంగా పుట్టిన కుమారుడు కూడా దివ్యాంగుడే.
దీంతో అరవై ఏళ్లకు పైగా భర్త వెంకయ్యతో కలిసి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను కాపాడుకుంటున్నారు. కష్టాల్లో చేదోడుగా ఉన్న భర్త వెంకయ్య 24 ఏళ్ల క్రితం మరణించడటంతో ఆమెది ఒంటరి పోరాటమైంది. అలా కష్టపడుతూనే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. పదేళ్ల క్రితం రెండో కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రస్తుతం ఇద్దరు కుమారులకు, తనకు వస్తున్న ఫించనే వారి జీవనానికి ఆధారం. ఆమె రెండో కుమార్తె కొడుకు క్రాంతి ఆమెతోనే ఉంటూ మేనమామలకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తన పరిస్థితిపై ప్రభుత్వం స్పందించి ఇద్దరు కుమారులకు చక్రాల కుర్చీలు అందివ్వాలని, మనవడికి ‘దళితబంధు’ కింద స్వయం ఉపాధి కల్పించి అండగా నిలవాలని దానమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




