AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: ఇండియా కూటమితో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి.. సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈరోజు తెలంగాణలో భారత్‌లో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని.. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో విజయభేరీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభతోనే ఎన్నికల రణరంగంలోకి దిగాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ బహిరంగ సభను ఏకంగా 10 లక్షల మందితో నిర్వహించాలని రాష్ట్ర హస్తం నేతలు ప్లాన్ చేశారు.

Sonia Gandhi: ఇండియా కూటమితో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి.. సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Malli Kharjun Kharge And Sonia Gandhi
Aravind B
|

Updated on: Sep 17, 2023 | 8:44 AM

Share

తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈరోజు తెలంగాణలో భారత్‌లో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని.. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో విజయభేరీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభతోనే ఎన్నికల రణరంగంలోకి దిగాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ బహిరంగ సభను ఏకంగా 10 లక్షల మందితో నిర్వహించాలని రాష్ట్ర హస్తం నేతలు ప్లాన్ చేశారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ సభలోనే కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ప్రకటించనుంది. దీంతో పార్టీ ఏ ఏ హామీలు ఇవ్వనుందనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అగ్రనేతలు.. ఆరు హామీలపై ఆరు గ్యారెంటీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమెనే ఈ ఆరు హామీలను ప్రకటిస్తారని సమాచారం. అందులో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, యువవికాసం కింద 2 లక్షల ఉద్యోగాల భర్తీ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు మహాలక్ష్మీ పేరుతో 3 వేల రూపాయల పింఛను, చేయూత కింద 4 వేల రూపాయల పింఛను హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే రైతుకు భరోసగా.. రైతులు, కౌలుదారులకు ఎకరానికి 15 వేల రూపాయలు, అంబెద్కర్ అభయహస్తం పేరుతో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం లాంటి హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే సభ జరిగిన అనంతంరం పార్టీ నేతలు నియోజకవర్గాలకు వెళ్లి.. ఈ కార్డులను ప్రజలకు ఇవ్వనున్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ హామీలను అమలు చేస్తామని చెప్పనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ హామీలపై కాంగ్రెస్ జోరుగా ప్రచారాలు చేస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశం తాజ్ కృష్ణా హోటల్‌లో జరగనుంది. దీనికి అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు, CLP నేతలు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సహా 147 మంది పరానున్నారు. ఈ సమావేశంలో పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఖర్గే ప్రసంగిస్తారని తెలిసింది. ఇదిలా మరోవైపు హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింక్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ కమిటీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇండియా కూటమితో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ముంబయిలో ఇండియా కూటమి పలు సమావేశాలను నిర్వహించింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి