Mallikarjun Kharge: ఆ పరిస్థితులను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలం.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొదటి సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఆహార భద్రత హక్కును పొందేందుకు కుల సర్వేతోపాటు, జనాభా లెక్కల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని పార్టీ డిమాండ్ చేస్తునందని ఖర్గే అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం 27 పార్టీలు ఏకతాటిపై నిలబడ్డాయన్నారు. ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక...
దేశంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, మణిపూర్‌లో చెలరేగుతోన్న హింస, విస్తరిస్తున్న అసమానతలను నియంత్రించడంతో నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. శనివారం జరిగిన సీడబ్లూసీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి సమావేశాలు విజయవంతం కావడంతో బీజేపీ కలత చెందుతోందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొదటి సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఆహార భద్రత హక్కును పొందేందుకు కుల సర్వేతోపాటు, జనాభా లెక్కల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని పార్టీ డిమాండ్ చేస్తునందని ఖర్గే అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం 27 పార్టీలు ఏకతాటిపై నిలబడ్డాయన్నారు. ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష కూటమి ముందుకు సాగుతోందని ఖర్గే అన్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను అణచివేయడానికి, పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఖర్గే అన్నారు. ప్రస్తుతం దేశం అనే అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందన్న ఖర్గే.. అసమానతలు, మణిపూర్‌లో చెలరేగుతోన్న హింసను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఖర్గే అన్నారు. మణిపూర్‌లో జరుగుతోన్న విషాదకర సంఘటనలను యావత్ దేశం చూస్తోందన్న ఖర్గే.. మోదీ ప్రభుత్వం మణిపూర్ అగ్నిని హర్యాకు చేరుకోవడానికి అనుమతించిందని ఆరోపించారు.
ఇలాంటి సంఘటనలు ఆధునిక, ప్రగతిశీల, లౌకిక భారతదేశ ప్రతిష్టతను దెబ్బ తీస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీతో పాటు, కొన్న మతతత్వ సంస్థలు, మీడియాలోని ఒక వర్గం అగ్నికి ఆజ్యం పోస్తున్నయాని ఖర్గే ఆరోపించారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో ఉందని, సామాన్య ప్రజల జీవితాలకు ధరల పెరుగుదల ప్రతికూలంగా మారిందన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత జరుగుతోన్నతొలి సమావేశాలు ఇవే. ఈ సమావేశాల్లో ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024ఓల జరిగే లోక్‌సభ ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా 39 మంది సభ్యులు హాజరయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..