Hyderabad: సీసీ కెమెరాలు పని చెయ్యవు.. సెక్యూరిటీ పట్టించుకోదు.. ఇది నీలోఫర్ ఆస్పత్రి పరిస్థితి.

Hyderabad: సీసీ కెమెరాలు పని చెయ్యవు.. సెక్యూరిటీ పట్టించుకోదు.. ఇది నీలోఫర్ ఆస్పత్రి పరిస్థితి.

Anil kumar poka

|

Updated on: Sep 16, 2023 | 7:07 PM

హైదరాబాద్​లోని నీలోఫర్ ఆసుపత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం కలకలం సృష్టించింది. గండిపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పైసల్‌ఖాన్‌ దంపతుల రెండో కుమారుడు. పెద్ద బాబుకు నిద్ర పట్టకపోవడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే రాత్రి సమయంలో భోజనం తెచ్చుకునేందుకు ఫరీదా వార్డు నుంచి బయటికి వెళ్లింది..భోజనం తీసుకుని తిరిగి వచ్చి చూస్తే బాబు కనిపించడం లేదు..

హైదరాబాద్​లోని నీలోఫర్ ఆసుపత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం కలకలం సృష్టించింది. గండిపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పైసల్‌ఖాన్‌ దంపతుల రెండో కుమారుడు. పెద్ద బాబుకు నిద్ర పట్టకపోవడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే రాత్రి సమయంలో భోజనం తెచ్చుకునేందుకు ఫరీదా వార్డు నుంచి బయటికి వెళ్లింది..భోజనం తీసుకుని తిరిగి వచ్చి చూస్తే బాబు కనిపించడం లేదు..దీంతో లబోదిబోమంటూ ఆ తల్లీ పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు పెట్టింది..పోలీసులు ఫరీదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలుడి కోసం గాలిస్తున్నారు.. ఫరీదా తన చిన్నారితో కలిసి ఆస్పత్రిలోని మొదటి అంతస్థులో ఉన్న సమయంలో ఆమెతో ఓ మహిళ సన్నిహితంగా మెలిగిందని, చుట్టూ ఉన్న వారు ఆమెను ఫరిదా బంధువు అనుకొని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. దాంతో ఆమె ఫరీదా కుమారుణ్ణి తీసుకెళ్తున్న సమయంలో ఎవ్వరూ అడ్డుకోలేదని అక్కడున్న వారు చెప్పారు. మరోవైపు వార్డులో సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పని చేయడంలేదు. దీంతో చిన్నారు ఆచూకి తెలుసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రస్తుతం 5 టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..