J&K Encounter: ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్న కశ్మీర్.. టెర్రర్ స్థావరాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు..
Anantnag encounter: సరిహద్దుల్లో నక్కిన ఉగ్రవాదల పనిపడుతోంది సైన్యం.. బారాముల్లా ప్రాంతంలో చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను కడతేర్చింది. కొకైర్‌నాగ్‌లో వరుసగా నాలుగో రోజు ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. పాకిస్తాన్ సరిహద్దుల నుంచి చొరబడుతున్న ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టి బుద్దిచెబుతోంది. ఎల్‌వోసీ దగ్గర హత్లాంగ్ ఫార్వర్డ్ ప్రాంతంలో టెర్రరిస్టుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. మూడో ముష్కరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటుండగా.. సమీపంలోని పాకిస్థాన్ పోస్ట్ నుంచి భారత సైన్యంపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు ఉరి సెక్టార్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది.

మరోవైపు, అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం కొనసాగిస్తున్న వేట నాలుగో రోజుకు చేరింది. గఢాల్ అడవుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని కచ్చితంగా కనిపెట్టేందుకు సైన్యం డ్రోన్లను రంగంలోకి దించింది. డ్రోన్లతో చేసిన సర్వే ఆధారంగా తీవ్రవాదులు దాక్కొన్న ప్రాంతంపై సైన్యం మోర్టార్ షెల్స్‌తో దాడి చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లోనే కర్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్పీ హుమాయున్ భట్, రాష్ట్రీయ రైఫిల్ సైనికుడు రవికుమార్ చనిపోయారు.
Look like #AnantnagEncounter is in last stage. The hunt for the remaining 2 pigs has been started. pic.twitter.com/duplFnfcTB
— Baba Banaras™ (@RealBababanaras) September 16, 2023
కొకైర్‌నాగ్‌లో ఉగ్రవాదుల స్థావరం..
కొకైర్‌నాగ్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని డ్రోన్ల సాయంతో గుర్తించింది సైన్యం.. మోర్టార్ షెల్స్‌తో ఆ స్థావరాన్ని ధ్వసం చేసిన వీడియోను సైన్యం విడుదల చేసింది. బారాముల్లాలో ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కొకైర్‌నాగ్ అటవీప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఆర్మీతో పాటు జమ్ముకశ్మీర్ ప్రత్యేక బలగాలు అణువణువు గాలిస్తున్నాయి. ఉగ్రవాదులు తిష్టవేసిన ప్రాంతానికి అతిసమీపంగా చేరుకున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రకదలికలు వేగం కావడం వెనుక పాకిస్తాన్ సైన్యం కుట్ర స్పష్టంగా బయటపడుతోంది.
3 More Pakistan Sponsored #PIG 🐖 Sent to 72 HOORS..🔥🔥
Jai Hind 🇮🇳🫡#IndianArmy #Baramulla #AnantnagAttack #AnantnagEncounter pic.twitter.com/mR6qXBtaD3
— देवी पार्वती (@Devi_parvathy20) September 16, 2023
#BaramullaEncounter ; Joint operation by Indian Army, J&K Police, Op Khanda over.
3 Pakistani Terrorists Knocked down. 2AK Rifles, 1 Pistol, 7 Hand Grenades, 1 IED, and other war like stores along with Pak currency recovered. #AnantnagAttack pic.twitter.com/Yp4cKpB9q6
— Kanwaljit Arora (@mekarora) September 16, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..