Temple: ఏడాదికి ఒక్కరోజే శ్రీవేంకటేశ్వరుడి దర్శనం.. ప్రత్యేకత ఏంటంటే..!

Temple: ఏడాదికి ఒక్కరోజే శ్రీవేంకటేశ్వరుడి దర్శనం.. ప్రత్యేకత ఏంటంటే..!

Anil kumar poka

|

Updated on: Sep 16, 2023 | 7:31 PM

సాధారణంగా ఏ దేవుడి ఆలయమైన సంవత్సరం పొడవును తెరిచే ఉంటుంది. ప్రతిరోజు ఆలయంలో నిత్య పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు, అర్చనలు జరుగుతుంటాయి. కానీ ఈ వెంకటేశ్వరుడి సన్నిధిలో కుల, పేద, చదువుకున్న, ధనిక అనే భేదం ఉండదు. స్త్రీలు ఇంట్లో చేసిన నైవేద్యాలను ఇక్కడికి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టి తినిపించే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది.

సాధారణంగా ఏ దేవుడి ఆలయమైన సంవత్సరం పొడవును తెరిచే ఉంటుంది. ప్రతిరోజు ఆలయంలో నిత్య పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు, అర్చనలు జరుగుతుంటాయి. కానీ ఈ వెంకటేశ్వరుడి సన్నిధిలో కుల, పేద, చదువుకున్న, ధనిక అనే భేదం ఉండదు. స్త్రీలు ఇంట్లో చేసిన నైవేద్యాలను ఇక్కడికి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టి తినిపించే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. కర్ణాటకలోని విజయపురలో నిడగుండి సమీపంలోని అడకల్ గుండప్ప సన్నిధి వెంకటేశ్వర స్వామి ఆలయం విభిన్నం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడో సోమవారం ఒక్కరోజు మాత్రమే అడకల్ గుండప్ప సన్నిధి తలుపులు తెరుస్తారు. ఈ సమయంలో భారీగా వచ్చే భక్తులు దేవుడిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఒక చేతిలో గొడుగు.. తలపై ప్రసాదాల బుట్టతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు మహిళలు. ముఖ్యంగా యలగూరు గ్రామానికి చెందిన భక్తులు సుక్షేత్రంలో మొక్కులు తీర్చుకుంటారు. పూర్వం గ్రామంలోని భక్తులంతా పల్లకీని ఎత్తుకుని తిరుపతికి ఏటా తీర్థయాత్రకు వెళ్లేవారు. భక్తుల కష్టాలు తెలుసుకున్న తిమ్మప్ప స్వయంగా తిరుపతి క్షేత్రానికి రావద్దని కోరినట్లు చెబుతుంటారు. అలా యలగూరేశ్‌లో గుండికెరె కొండకు తానే స్వయంగా వచ్చి స్థిరపడతానని తిరుపతి తిమ్మప్ప తెలిపారట. అందుకే అప్పటి నుంచి భక్తులు తిరుపతికి వెళ్లడం మానేశారు. తిరుపతి తిమ్మప్పకు ప్రతీకగా వందేళ్ల క్రితం కొండపై ఏకశిలలో వెలసిన వెంకటరమణ, లక్ష్మీమూర్తికి ఏడాదికోసారి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..