CWC Meeting in Hyderabad: సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఇవాళ విస్తృతస్థాయి భేటీ.. కీలక విషయాలపై చర్చించే ఛాన్స్..

CWC Meeting in Hyderabad: రెండు రోజుల సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఇవాళ విస్తృతస్థాయి భేటీ జరగనుంది. ఇవాళ్టి కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. పలు కీలక విషయాలపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. పొత్తులు, వ్యూహాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో సోనియా ప్రకటించే ఎన్నికల హామీపై ఆసక్తి నెలకొంది. మరోవైపు నిన్నటి సిడబ్ల్యూసీ సమావేశంలో 14 తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఇవాళ్టి సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్‌ పాలిత నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో అధిక శాతం సంస్థాగత విషయాలే...

CWC Meeting in Hyderabad: సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఇవాళ విస్తృతస్థాయి భేటీ.. కీలక విషయాలపై చర్చించే ఛాన్స్..
Cwc Meeting
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 17, 2023 | 6:12 AM

CWC Meeting in Hyderabad: రెండు రోజుల సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఇవాళ విస్తృతస్థాయి భేటీ జరగనుంది. ఇవాళ్టి కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. పలు కీలక విషయాలపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. పొత్తులు, వ్యూహాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో సోనియా ప్రకటించే ఎన్నికల హామీపై ఆసక్తి నెలకొంది. మరోవైపు నిన్నటి సిడబ్ల్యూసీ సమావేశంలో 14 తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఇవాళ్టి సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్‌ పాలిత నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో అధిక శాతం సంస్థాగత విషయాలే చర్చిస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఆ తర్వాత పొత్తులపై చర్చలు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలందరి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ్టి ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు.

4 తీర్మానాలకు ఆమోదం..

హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో.. 14 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. కశ్మీర్ లో చనిపోయిన బలగాల కుటుంబాలకు సంతాపం, ఖర్గే సేవలకు, అలుపెరుగని రాజకీయ పోరాటానికి ప్రశంసలు, భారత్ జోడో యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఆ స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయం, మణిపూర్ లో వ్యవస్థల వైఫల్యంపై ఖండన. అలాగే కులతత్వం, మతత్వం, ప్రాంతీయవాదాలు ఉండొద్దన్న మోదీ మాటలపై ఫైర్ అయ్యారు. కనీస మద్దతు ధర సహా రైతులకు ఇచ్చిన హామీలు తప్పారని తీర్మానం, పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన, కొత్త రాజ్యాంగం, మౌలిక నిర్మాణాన్ని మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకం. అలాగే పార్లమెంటు చర్చలు, నియంత్రణలు వదిలి, దీర్ఘకాల ప్రభావం ఉండే నిర్ణయాలను హడావుడిగా తీసుకుంటున్న తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు. అంశాలు సూచించిన సోనియాకు అభినందన అలాగే ఆదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఫెడరల్ పై దాడి, విపక్ష రాష్ట్రాలకు డిజాస్టర్ నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం. అలాగే చైనా ఆక్రమణలపై ఖండన.. కేంద్రం ధీటుగా వ్యవహరించాలని డిమాండ్. ఇక దేశంలో మత, కుల, వర్గ సామరస్య వాతావరణాన్ని నిలబెట్టాలి.. ఈ విషయంలో ప్రజలకు అండగా ఉంటాం. అలాగే విభజన రాజకీయలను వ్యతిరేకిస్తూ సిద్ధాంత, ఎన్నికల విషయాలు సాధించడానికి ఇండియా కూటమి కట్టుబడి ఉందనే 14 తీర్మాలను సీడబ్ల్యూసీ ఆమోదించింది.

5 ఎన్నికల హామీలను ప్రకటించనున్న సోనియా..

మరోవైపు ఇవాళ తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి సభను భారీ ఎత్తున నిర్వహిస్తుంది. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో సోనియాగాంధీ 5 ఎన్నికల హామీలను ప్రకటించనున్నారు. ఈ సభకు సోనియాగాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర రాష్ర్టాల సీఎంలు, సీఎల్పీ నేతలు హాజరవుతున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మందిని సేకరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే తుక్కుగూడ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి సభా ప్రాంగణం వరకు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..