భార్య టార్చర్ భరించలేక భర్త ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే ?
వివాహం అయిన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సహజమే. అయితే వీటిని సర్దుకొని కొంతమంది దంపతులు ముందుకు పోతారు.. మరికొందరు విడిపోతారు. అయితే తాజాగా ఓ భర్త.. తన భార్య పెడుతున్న టార్చర్‌ను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా బీ క్రాస్ సమీపంలోని కుందూరు పాళ్యలో జరిగింది. ఇక వివరాల్లోకి వెల్తే మంజునాథ్(38) అనే యువకుడు బెంగళూరులోని బీఎంఆర్ సీఎల్ (నమ్మ బెంగళూరు మెట్రో)లో ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడు.
వివాహం అయిన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సహజమే. అయితే వీటిని సర్దుకొని కొంతమంది దంపతులు ముందుకు పోతారు.. మరికొందరు విడిపోతారు. అయితే తాజాగా ఓ భర్త.. తన భార్య పెడుతున్న టార్చర్‌ను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా బీ క్రాస్ సమీపంలోని కుందూరు పాళ్యలో జరిగింది. ఇక వివరాల్లోకి వెల్తే మంజునాథ్(38) అనే యువకుడు బెంగళూరులోని బీఎంఆర్ సీఎల్ (నమ్మ బెంగళూరు మెట్రో)లో ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి కర్ణాటకలోని తురువేకెరె ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే యువతితో పది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే చాలాకాలంగా మంజునాథ్, ప్రియాంక మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.
వివాహం జరిగిన తర్వాత భార్య ప్రియాంక తన భర్త మంజునాథ్‌ను మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నువ్వు ఓ పెద్ద పల్లె గొర్రె.. నిన్ను వివాహం చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. మా తల్లిదండ్రులు బలవంతంగా నీతో పెళ్లి జరిపినట్లు ప్రియాంక తన భర్తతో పదేపదే వాదిస్తుండేది. అలాగే నీతో కాపురం కూడా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదంటూ చెప్పేది. ఈ విషయాల వల్లే ఈ భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక భార్య ప్రియాంక వేధింపులు తాళలలేక మంజునాథ్ మనస్తాపానికి గుర్యయాడు. చివరికి తమకూరు జిల్లాలోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు మరో విషయం ఏంటంటే.. ఆత్మహత్యకు ముందు మంజునాథ్ కూడా తన సోదరుడికి… అతని భార్య ఎలా టార్చర్ పెడుతుందో అనే విషయాన్ని కూడా ఓ ఆడియో సందేశం ద్వారా పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ఆడియో సందేశంలో.. మంజునాథ్ ఇలా మాట్లాడాడు. నాకు నా భార్య ప్రియాంకతో కలిసి ఉండటం ఇష్టం లేదు. ఇంట్లో నా భార్య ప్రియాంక టార్చర్ భరించలేకపోతున్నా.. అందుకే చనిపోతున్నాను. నా పిల్లలను బాగా చూసుకోండంటూ ఆ మెట్రో ఇంజనీర్ మంజునాథ్ మాట్లాడాడు. ఆ తర్వత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన అనంతరం భార్య ప్రియాంకపై తుమకూరు జిల్లాలోని కిబ్బనహళ్లి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొత్తం మీద భార్య టార్చర్ భరించలేక బెంగళూరు మెట్రో ఇంజనీరు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ప్రియాంకను ఇంకా అరెస్టు చెయ్యలేదని.. కేసు ఇంకా విచారణలో కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి