Health: యూరిన్ దుర్వాసన వస్తోందా… కారణం ఇదే తెలుసా.?

యూరిన్‌ వాసన ఉండడం సర్వసాధారణమైన విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విపరీతమైన దుర్వాసన వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దుర్వాసనతో పాటు, మూత్రం రంగు మారితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మూత్రం దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. కాఫీ తాగే అలవాటు ఉన్న వారిలో కూడా మూత్రం దుర్వాసన వస్తుంది...

Health: యూరిన్ దుర్వాసన వస్తోందా... కారణం ఇదే తెలుసా.?
Urine Smell
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 15, 2023 | 9:58 PM

మనిషి ఆరోగ్యాన్ని యూరిన్‌ ద్వారా అంచనా వేయొచ్చని తెలిసిందే. ఎన్నో రకాల వ్యాధులను యూరిన్‌ టెస్ట్‌ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అందుకే యూరిన్‌లో రంగు మారినా, వాసన మారినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో యూరిన్‌ విపరీతమైన వాసన వస్తుంది. బాత్‌రూమ్‌ మొత్తం దుర్వాసనతో నిండిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే భయంగా ఉంటుంది. శరీరంలో ఏదో అనారోగ్యం కారణంగానే మూత్రం చెడు వాసన వస్తుందని భావిస్తుంటారు. ఇంతకీ యూరిన్‌ బ్యాడ్‌ స్మెల్ ఎందుకు వస్తుంది.? ఇలా వస్తే ఏమవుతుంది.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

యూరిన్‌ వాసన ఉండడం సర్వసాధారణమైన విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విపరీతమైన దుర్వాసన వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దుర్వాసనతో పాటు, మూత్రం రంగు మారితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మూత్రం దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. కాఫీ తాగే అలవాటు ఉన్న వారిలో కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్‌. అంతేకాకుండా కెఫిన్‌ వల్ల శరీరం డీహైడ్రేషన్‌ గురవుతుంది. ఇది కూడా యూరిన్‌ దుర్వాసనకు ఒక కారణంగా చెప్పొచ్చు.

ఇక వెల్లుల్లి, ఉల్లి అధికంగా వేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా యూరిన్‌ దుర్వాసన వస్తుంది. వీటిలో ఉండే సల్ఫర్‌ మూత్రాన్ని కలుషితం చేస్తుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల కుళ్లిన గుడ్డులాంటి వాసన వస్తుంది. జీలకర్ర, పసుపు, కొత్తిమీర వంటివి అధికంగా తీసుకున్నా యూరిన్‌ దుర్వాసన వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆహారంలో జీర్ణమైన తర్వాత కూడా మూత్రంలో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. దీంతో దుర్వాసన ఎక్కువగా వస్తుంది.

ఇక మూత్రం దుర్వాసనతో వస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దుర్వాసనతోపాటు మూత్రం రంగులో మార్పులు కనిపించినా, నొప్పిగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడినా మూత్రం దుర్వాసన వస్తుంది. టైప్‌2 డయాబెటిస్‌, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారికి కూడా మూత్రం దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మూత్రం దుర్వాసన వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన టెస్ట్‌లు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలను పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?