Telangana Municipal Elections: పురపోరుకు నగారా..! పార్టీల బలాబలాలేంటి.. నేతల వ్యూహాలేంటి..
ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అవుతాయా? ఫలితాలు ఎలా వచ్చినా, ఎవరికి అనుకూలంగా ఉన్నా.. జరిగేది ఇదే. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ చెరిసగం సీట్లు పంచుకున్నాయి. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. రెండు బైఎలక్షన్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కైవసం చేసుకుని పట్టణ ఓటర్లలోనూ కాంగ్రెస్‌కు బలం ఉందని నిరూపించుకుంది కాంగ్రెస్.

ఈ ఒక్క తీర్పు వస్తే చాలు.. ప్రజల ఆమోదముద్ర దొరికినట్టే. ఉప ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికల్లోనైనా.. తమదే కదా పైచేయి అని చెప్పుకుంటోంది రేవంత్ సర్కార్. తమ పాలనపై ప్రజలు ఆమోదముద్ర వేయడానికి ఇంకొక్క అడుగు మాత్రమే మిగిలి ఉందనేది అధికార పార్టీ ఫీలింగ్. అటు.. విపక్షాలకు సైతం ఈ ఒక్క తీర్పు తమకు అనుకూలంగా వస్తే చాలనుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలను ఇలా టర్న్ చేసేయొచ్చనే భావనలో ఉన్నాయి. ఈ ఎన్నికలు ముగిసిపోతే.. ఇప్పట్లో ఇంత పెద్ద ఎన్నికలు లేవు. అందుకే, వ్యూహాలన్నిటినీ ఇప్పుడే ప్రయోగిస్తాయి. తమ శక్తినంతా ఇప్పుడే బయటకు తీస్తాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే తీర్పే.. పార్టీలతో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అనే డైలాగ్ కొట్టిస్తుంది కూడా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2వేల 996 మున్సిపల్ వార్డులకు 8వేల 195 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్ పెట్టాల్సి వస్తే ఫిబ్రవరి 12న పెడతారు. పోలింగ్ ముగిసిన రెండ్రోజులకు, అంటే ఫిబ్రవరి 13న కౌంటింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 16వ తేదీన 116 మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); షెడ్యూల్ విడుదలతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈనెల...
