AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు అలర్ట్.. జనవరి 30న మటన్, చికెన్ షాపులు బంద్

జనవరి 30న గాంధీ జయంతిని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరవ్యాప్తంగా మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు అలర్ట్.. జనవరి 30న మటన్, చికెన్ షాపులు బంద్
Chicken Shops
Venkatrao Lella
|

Updated on: Jan 27, 2026 | 9:18 PM

Share

జనవరి 30వ తేదీన మహత్మాగాంధీ వర్ధంతి జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాంసం విక్రయాలు బంద్ కానున్నాయి. గాంధీ జయంతి, వర్థంతి సందర్భంగా ప్రతీసారి మాంసం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధిస్తూ ఉంటాయి. ఈసారి కూడా అదే తరహాలోనే నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ క్రమంలో జనవరి 30న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు తాజాగా జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. మాంసం షాపులతో పాటు గొర్రెలు, మేకల కబేళాలు కూడా మూసివేయాలని ఆదేశించింది.

ఓపెన్ చేస్తే కఠిన చర్యలు

మహత్మాగాంధీ వర్దంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో మాంసం విక్రయాలపై బ్యాన్ విధించినట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రజలతో పాటు షాపుల యజమానులు సహకరించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. అన్ని షాపుల నిర్వహకులు తమకు సహకరించాలని కోరింది. ప్రతీ ఏడాది గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసి ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈ సారి కూడా అది కొనసాగిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జాతిపిత మహత్మాగాంధీకి గౌరవార్ధంగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీలోనూ బంద్

అటు హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాంసం విక్రయాలపై నిషేధం కొనసాగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఏపీలో కూడా జనవరి 30న మాంసం షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు నగర పాలక సంస్థలు ప్రకటన జారీ చేస్తున్నాయి.

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..