AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లాక్‌డౌన్‌లో ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?

Lockdown - How to Apply E-Pass: తెలంగాణలో లాక్‌డౌన్‌ను మళ్లీ 10 రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తదితర అంశాలపై

Telangana: లాక్‌డౌన్‌లో ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?
Lockdown In Telangana
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2021 | 5:32 PM

Share

Lockdown – How to Apply E-Pass: తెలంగాణలో లాక్‌డౌన్‌ను మళ్లీ 10 రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌‌రావు అధ్యక్షతన ఆదివారం సమావేశమైన మంత్రి మండలి జూన్ 9 వరకూ లాక్‌డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ఉన్న సడలింపు సమయాన్ని పెంచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సండలింపు ఉంటుందని.. దీంతోపాటు బయటకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లేందుకు 2 గంటల వరకూ సమయం ఇచ్చారు. అనంతరం 2 గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

అయితే.. వేరే రాష్ట్రాలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ ఇది వరకూ సూచించిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికి ఈ పాసులను జారీ చేస్తారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు పాస్‌లను జారీ చేస్తారు. అయితే ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకునే వారు వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి.. ➼ ముందుగా తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/ లో లాగిన్ కావాలి ➼ అనంతరం ఈ పాస్ e-Pass పై క్లిక్ చేయాలి ➼ మీరు నివసిస్తున్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి ➼ ఆ తర్వాత మీరు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది ➼ పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, ఏ పర్పస్ కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలతోపాటు.. ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ➼ ఫాంలను అప్‌లోడ్ చేయాలి. ➼ ఆతర్వాత కర్ఫర్మేషన్ వస్తుంది. ➼ ఆయా పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరు అవుతుంది. ➼ దానిని చూపించి రాష్ట్రం పరిధిలోని జిల్లాలకు ఆంక్షల సమయంలో ప్రయాణం చేయవచ్చు. అయితే.. లాక్‌డౌన్ సడలింపు సమయంలో ఈ పాస్ అవసరం లేదని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Lockdown: నిబంధనలు పాటించాల్సిందే.. లాక్‌డౌన్‌లో బయటకు వస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్

Model Rape: బాలీవుడ్‌లో కలకలం.. ప్రముఖ మోడల్‌పై అత్యాచారం.. 9 మంది సెలబ్రిటీలపై కేసు..

Juhi Chawla: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లక్కిన నటి జుహీ చావ్లా..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!