Model Rape: బాలీవుడ్‌లో కలకలం.. ప్రముఖ మోడల్‌పై అత్యాచారం.. 9 మంది సెలబ్రిటీలపై కేసు..
Mumbai Model Rape: బాలీవుడ్‌కు చెందిన 9 మంది ప్రముఖ వ్యక్తులపై అత్యాచారం, వేధింపుల కేసు నమోదైంది. బాలీవుడ్ కు చెందిన 9 మంది ప్రముఖులు, సెలబ్రిటీలు
Mumbai Model Rape: బాలీవుడ్‌కు చెందిన 9 మంది ప్రముఖ వ్యక్తులపై అత్యాచారం, వేధింపుల కేసు నమోదైంది. బాలీవుడ్ కు చెందిన 9 మంది ప్రముఖ వ్యక్తులు తన మీద అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రముఖ మోడల్, నటి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలీవుడ్‌కు చెందిన ఫేమస్ ఫోటోగ్రాఫర్, ప్రముఖ నటుడు, ఓ ప్రముఖ ఆడియో సంస్థకు చెందిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మీద ఈ కేసు నమోదైనట్లు బాంద్రా పోలీసులు వెల్లడించారు. అవకాశం పేరిట 2014 నుంచి 2018 వరకూ వీరంతా పలు సందర్భాల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ప్రముఖ మోడల్ వివరాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఎప్పుడు, ఎక్కడ అత్యాచారం జరిగిందో కూడా ఆ మోడల్ చెప్పడం ప్రస్తుతం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. మోడల్ ఫిర్యాదు మేరకు బాలీవుడ్‌కు చెందిన 9 మంది ప్రముఖులపై ఐపిసి సెక్షన్ 378 (ఎన్), 354, 34 కింద బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా.. తన మీద అత్యాచారం, లైంగిక దాడి చేసిన కామాంధులపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇంత వరకు అరెస్టు చెయ్యలేదని లేడీ మోడల్ ఆరోపిస్తోంది. ఫిర్యాదు చేసిన తొమ్మిది మందిలో ఒకరు విదేశాల్లో ఉండటం, కేసు నమోదు అయిన వెంటనే ఫోటోగ్రాఫర్ అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోవడం, కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారని వార్తలు వస్తున్నాయి. కాగా.. ప్రముఖలు కొంత మంది ఫేమస్ మోడల్ మీద అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడ్డారన్న సంఘటన వెలుగు చూడటంతో బాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
Also Read: