Telangana Lockdown: నిబంధనలు పాటించాల్సిందే.. లాక్‌డౌన్‌లో బయటకు వస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్
Cyberabad CP VC Sajjanar: లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు
Cyberabad CP VC Sajjanar: లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ సోమవారంతో 19వ రోజుకు చేరింది. రాష్ట్ర క్యాబినెట్ లాక్‌డౌన్‌ను అదేవిధంగా సడలింపు సమయాన్ని పెంచుతూ ఆమోదం తెలపిన విషయం తెలిసిందే. జూన్ 9 వరకూ లాక్‌డౌన్‌ను పెంచడంతోపాటు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కూకట్‌పల్లి, జె.ఎన్.టి.యూ చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో షాపులు, ఆఫీసులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసివేయాలని సూచించారు. రేపటి నుంచి లాక్‌డౌన్ మరింత కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
సరుకుల రవాణా వాహనాలకు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలాకాకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే వారు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని దానికి సంబంధించిన పత్రాలు చూపించి వెళ్లాలని పేర్కొన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. సీపీ వెంట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, కూకట్ పల్లి ఏసీపీ సురేందర్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంటీఓ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Also Read: