TS Inter Results: తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో బాలికలదే హవా.. మొత్తం ఎంత మంది పాస్ అయ్యారంటే.
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాసేపటి క్రితమే విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఫలితాలను విడదుల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. రెండింటిలోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది...

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాసేపటి క్రితమే విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఫలితాలను విడదుల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. రెండింటిలోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరుకాగా వీరిలో 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,60,000 మంది A గ్రేడ్‌లో పాస్‌కాగా, 68,335 మంది B గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 56.82 శాతం మంది పాస్ అయ్యారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..
ఇక సెకండ్ ఇయర్ విషయానికొస్తే.. మొత్తం 3,80,920 మంది హాజరుకాగా 2,56,241 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో లక్ష 73వేల మంది A గ్రేడ్‌లో పాస్ కాగా, 54,786 మంది B గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఇక అమ్మాయిలు 73.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలుల 60.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సుల విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 2,55,533 మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 28738 మంది పాస్ అయ్యారు.




మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
