Zero Shadow Day: కమాన్.. సెలబ్రేట్.. జీరో షాడో డే.. కాసేపట్లో హైదరాబాద్‌లో నీడలు మాయం.. భూమ్మీద జరగబోతున్న సౌర అద్భుతం

ఇవాళ 12.12 గంటలకు ప్రపంచానికే షాకిచ్చే ఒక విషయం జరుగుతుంది. విచిత్రంగా నీ నీడ నీకు దూరమవుతుంది.. ఎలా? ఇది ప్రకృతిమాత ఇంద్రజాలమా? లేక... సైన్స్ అండ్ టెక్నాలజీ ఫలితమా...? జీరో షాడో డే... మీ నీడ మిమ్మల్ని వదిలిపెట్టే రోజు. కొన్ని క్షణాల పాటు మీ నీడ మీనుంచి మాయమయ్యే రేర్ అండ్ రేరెస్ట్ డే ఇదే. ఏడాదిలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ ఖగోళ అద్భుతానికి ఈసారి హైదరాబాద్ నగరం వేదికైంది. ఎప్పుడూ మనల్ని వెంటాడే నీడ... మనకు దూరమవడం అనే అరుదైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం కేవలం మనకు మాత్రమే దక్కింది. లెటజ్ గో ఇన్‌టూ డీటెయిల్స్.

Zero Shadow Day: కమాన్.. సెలబ్రేట్.. జీరో షాడో డే.. కాసేపట్లో హైదరాబాద్‌లో నీడలు మాయం.. భూమ్మీద జరగబోతున్న సౌర అద్భుతం
No Shadow
Follow us
Sanjay Kasula

|

Updated on: May 09, 2023 | 11:55 AM

హైదరాబాద్ మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు జీరో షాడో డేగా పిలువబడే మంత్రముగ్దులను చేసే ఖగోళ దృగ్విషయాన్ని చూడనుంది. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ వార్షిక సంఘటన సూర్యుడు ఆకాశంలో ఎత్తైన స్థానానికి చేరుకున్న రోజును సూచిస్తుంది. దీని వలన ఏదైనా నిలువు వస్తువు నీడ అదృశ్యమవుతుంది. ఈ విశిష్ట సంఘటనను అనుభవించడానికి, సూర్యుడు నేరుగా తలపై ఉండే బహిరంగ ప్రదేశంలో ఉండాలి. దీని అర్థం ఎత్తైన భవనాలు లేదా చెట్ల వంటి నీడను కలిగించే అడ్డంకులు లేని ప్రాంతంలో ఉండటం.

సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు ఏదైనా నిలువు వస్తువు నీడ అదృశ్యమవుతుంది. ఇది సున్నా నీడను అనుభవించే అరుదైన అవకాశాన్ని ఇస్తుంది. సూర్యుని క్రింద నేరుగా ఉండే చదునైన ఉపరితలం, దానికి స్థిరంగా ఉండే తెల్లటి కాగితం ప్రజలకు అవసరం. PVC (పాలీవినైల్ క్లోరైడ్) పైపు లేదా మెటల్ టంబ్లర్ వంటి పొడవాటి, అపారదర్శక వస్తువును తెల్లటి కాగితంపై నిలువుగా మధ్యాహ్నం సమయంలో ఉంచండి. కాగితంపై వస్తువు నీడను గుర్తించండి. ఐదు నిమిషాల వ్యవధిలో దాని స్థానాన్ని గమనించండి.

అటోఇటో ఎటోవైపు నీడ తప్పనిసరిగా కనిపిస్తుంది. కానీ… ఏడాదిలో రెండేరెండు సందర్భాల్లో సూర్యుడు సరిగ్గా మన నెత్తి మీదకే వచ్చేస్తాడు. అంటే… భూగ్రహం మూమెంట్‌కీ, సూర్యుడి కదలికకూ 90 డిగ్రీలతో పర్‌ఫెక్ట్‌ వర్టికల్‌ పొజిషన్ ఏర్పడుతుంది. ఆ కచ్చితమైన స్థానం ఈసారి హైరదాబాదైంది. కమాన్.. సెలబ్రేట్… జీరో షాడో డే…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం