TS Inter Exams Fee Due Dates 2021: ఇంటర్‌ పరీక్ష రుసుం చెల్లింపు తేదీలు ప్రకటించిన బోర్డు.. పూర్తి వివరాలు ఇవిగో

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

TS Inter Exams Fee Due Dates 2021: ఇంటర్‌ పరీక్ష రుసుం చెల్లింపు తేదీలు ప్రకటించిన బోర్డు.. పూర్తి వివరాలు ఇవిగో
Follow us

|

Updated on: Jan 30, 2021 | 3:29 PM

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటర్‌ పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 11ను తుదిగడువుగా నిర్ణయించింది. రూ.100 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 22 వరకు గడువు ఉంటుంది.  రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 2 వరకు ఫీజు చెల్లించవచ్చు.  రూ.1000 ఆలస్య రుసుముతో మార్చి 9 వరకు ఫీజు గడువు ఉంటుంది.  రూ.2వేల ఆలస్య రుసముతో మార్చి 16 వరకు ఫీజు చెల్లించవచ్చు.

ఇక మే 1 నుంచి 19 వరకు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం‌ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం‌ పరీక్షలు  నిర్వహంచనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.

ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్,  ఏప్రిల్‌ 3న  ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ ఎగ్జామ్స్, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని  ఇంటర్‌ బోర్డు అనౌన్స్ చేసింది. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల ఎగ్జామ్స్‌కు కూడా ఇదే షెడ్యూల్‌ ఉంటుంది.  పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి నిర్వహించే అవకాశం ఉంది.

Also Read : ఫిబ్రవరి 1 నుంచి ఓయూ పరిధిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. అయితే, వారి సమ్మతి తప్పనిసరి..!

Pulse Polio drive : జనవరి 31 పల్స్‌ పోలియో కార్యక్రమం.. ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’