Road accident : హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. కారులో లభించిన గంజాయి..
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ ను ఢీ కొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి.

Road accident : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నార్సింగ్ నుంచి శంషాబాద్ వెళ్తున్న కారు హిమాయత్ సాగర్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు.. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలుస్తుంది. డ్రైవర్ తో పాటు కారులో మిగిలిన వారు కూడా మద్యం సేవించి ఉన్నారని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన కారులో గంజాయి లభ్యమైంది.