Viral Video: కూతుర్ల ప్రాణం కోసం తనకేమైనా పర్వాలేదునుకుంది చూడూ… అదృష్టం కూడా బాగున్నట్టుంది
పిల్లల ప్రాణం మీదికి వస్తే ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోదు. అది మనుషులైనా, ఇతర జంతువులైనా పిల్లలను ప్రాణం లెక్క కాపాడుకుంటారు. అనుకోని ఆపద ఏదైనా సంభవిస్తే ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటారు. అలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలో జరిగింది. తాజాగా ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లను విషసర్పం బారి నుంచి కాపాడిన తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ తల్లి ధైర్యాన్ని నెజన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. వీడియోలో కనిపిస్తున్నదాని ప్రకారం ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా విషపూరిత పాము ఒకటి ఆ చిన్నారుల వైపు,,,

పిల్లల ప్రాణం మీదికి వస్తే ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోదు. అది మనుషులైనా, ఇతర జంతువులైనా పిల్లలను ప్రాణం లెక్క కాపాడుకుంటారు. అనుకోని ఆపద ఏదైనా సంభవిస్తే ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటారు. అలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలో జరిగింది. తాజాగా ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లను విషసర్పం బారి నుంచి కాపాడిన తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ తల్లి ధైర్యాన్ని నెజన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.
వీడియోలో కనిపిస్తున్నదాని ప్రకారం ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా విషపూరిత పాము ఒకటి ఆ చిన్నారుల వైపు వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ప్రమాదం గురించి బాలికలకు తెలియదు. కానీ. వారి తల్లి పామును గమనించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ తల్లి ధైర్యంగా తన పిల్లలను కాపాడింది.ఆ మహిళ తన తెలివితేటలను ప్రదర్శించి బాలికలను పాము బారి నుంచి కాపాడింది. ఈ తతంగమంతా ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తల్లి భయం లేకుండా కూతుళ్లను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి పామును తరిమికొట్టేందుకు ఎలా ప్రయత్నిస్తుందో వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది మంది దీనిని చూసి ఆ తల్లి ధైర్యసాహసాలను పొగుడుతున్నారు. కామెంట్ సెక్షన్‌లో ఈ అమ్మ నిజంగా ‘సూపర్‌మామ్’ అని అంటున్నారు. చాలా మంది నెటిజన్స్ ఈ సంఘటన స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. తల్లి తన పిల్లల భద్రత కోసం ఎంతకైనా తెగిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
Mother tries to save her two daughters from a venomous snake in Australia pic.twitter.com/UYLtsIuk00
— Wild content (@NoCapMediaa) March 26, 2025
అయితే అనేక రకాల విషపూరిత పాములు ఆస్ట్రేలియాలో తరచుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు నివాస ప్రాంతాలకు కూడా వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్నేక్ క్యాచర్స్ వంటి వన్యప్రాణి నిపుణుల సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.