Pulse Polio drive : జనవరి 31 పల్స్ పోలియో కార్యక్రమం.. ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఆదివారం(జనవరి 31 ) నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది.

Pulse Polio drive : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఆదివారం(జనవరి 31 ) నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రంలో 52,72,354 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మరో వైపు తెలంగాణలోనూ ‘పల్స్ పోలియో’ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ నగరంలో చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెల 17 నిర్వహించాల్సిన కార్యక్రమం కరోనా టీకా పంపిణీతో వాయిదా వేశారు. దాంతో ఈ నెల 31వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులకు టీకా వేసేందుకు వైద్యశాఖ అధికారులు ముందుకు వెళ్లుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,15,520మంది పిల్లలకు వేసేందుకు 2800 మంది సిబ్బంది సిద్ధం చేశారు అధికారులు .
మరిన్ని ఇక్కడ చదవండి :
తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ తీవ్రత.. కొత్తగా 186 మందికి పాజిటివ్ నిర్దారణ