మదనపల్లె జంట హత్యల కేసు.. వారి ప్రసంగాలే ప్రభావితం చేశాయా.! అంతగా ప్రేరేపించింది ఎవరు.?
Madanapalle Incident: చివరకు ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా అదే మూఢ విశ్వాసాలతో భయానక ఘటనలకు పాల్పడ్డారు. ఇద్దరు కుమార్తెలను..

Madanapalle Incident: ఉన్నత చదువులు చదివిన అలేఖ్య మూఢనమ్మకాలకు ప్రభావితురాలైంది. మంచి చదువు చదువుకుని.. మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న అలేఖ్య ప్రముఖుల ప్రసంగాలకు ఆకర్షితురాలై.. వాటినే అధ్యయనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖుల ప్రసంగాలు వింటూ, రచనలు చదువుతూ చివరికి వారు తమను తాము దేవుళ్లుగా ఊహించుకుంటూ భ్రమల్లోకి వెళ్లి పోయారని భావిస్తున్నారు. తనలా అమ్మాయి రూపంలో శివుడు రావటం అరుదని భావించి అలేఖ్య, తన మూఢవిశ్వాసాలను తల్లిదండ్రులు నమ్మేలా చేశారు.
చివరకు ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా అదే మూఢ విశ్వాసాలతో భయానక ఘటనలకు పాల్పడ్డారు. ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చారు. వీరిద్దరి మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వారికి జైలు లాంటి వాతావరణంలోనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందని, అందరితో పాటు ఉంచితే ప్రమాదమని పేర్కొన్నారు. అందుకోసం వారికి విశాఖ ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి వైద్యం కోసం సిఫార్సు చేశారు.
చెల్లి చనిపోతా అంటే ఆపాల్సిన అక్క ప్రోత్సహించింది..చెల్లి తిరిగి తీసుకు వస్తానంటూ చెప్పిన అక్కను వారించాల్సిన తల్లిదండ్రులు ఆమెకు హెల్ప్ చేయడం ఫ్యామిలీ మొత్తం మానసిక వ్యాధితో బాధపడుతున్నదని స్పష్టంగా అర్థమవుతుంది..పద్మజ సన్నిహితులను మానసిక వైద్యులు విచారించగా ఆమె తండ్రి కూడా 20 ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిసింది. పద్మజ మేనమామ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారని, వంశపారంపర్యంగా పద్మజకు.. ఆమె కూతురు అలేఖ్యకు ఇది సంక్రమించి ఉండొచ్చని మానసిక వైద్యులు భావిస్తున్నారు.