AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‎లో హారర్, మిస్టరీ థ్రిల్లర్స్, రొమాంటిక్ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినీప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న ఈ కంటెంట్ చిత్రాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ అడియన్స్ ముందుకు రాబోతుంది.

OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..
Kingston
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2025 | 7:49 AM

Share

ఇటీవల తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా కింగ్ స్టన్. తమిళంలో రూపొందించిన ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా.. ఇండియాలోనే తొలిసారిగా సీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందు పోస్టర్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

కింగ్ స్టన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇప్పుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుందని సమాచారం. అయితే స్ట్రీమింగ్ డేట్ పై జీ5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ తోపాటు హీరోయిన్ దివ్యభారతి చేతన్, అళగమ్ పెరుమాళ్, సాబుమోన్ అబ్దుసమాద్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించడం విశేషం. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈసినిమా కేవలం రూ.5.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను ప్యార్లల్ యూనివర్సల్ పిక్చర్స్, జీ స్టూడియోస్ పతాకాలపై జీవీ ప్రకాశ్ కుమార్, భవానీ శ్రీ, ఉమేశ్ కేఆర్ భన్సల్ నిర్మించారు.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?