Telangana Inter Admissions: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు..
తెలంగాణలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబరు నెల...
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది అడ్మిషన్స్ గడువు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 15 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆ గడువు ఈ నెల 30 వరకు ఉండగా.. దాన్ని మరో 16 రోజుల పాటు పొడిగించింది. అంతే కాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది రికార్డు రేంజ్‌లో విద్యార్థులు చేరుతున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ సంఖ్య లక్ష దాటింది. ఐదారేళ్లుగా గవర్నమెంట్ కాలేజీలపై విద్యార్థులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకీ అడ్మిషన్స్ సంఖ్య పెరుగుతుండటంతో సెప్టెంబరు 15వరకు ఇంటర్ బోర్డు.. అడ్మిషన్స్ గడువును పొడిగించింది. ఓ వైపు అడ్మిషన్స్ జరుగుతుండగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ కొనసాగుతున్నాయి. మరో వైపు మొదటి ఏడాదికి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ నెల 16నుంచి ఇంటర్ విద్యాశాఖ ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. ఈ నెలాఖరు వరకు దూరదర్శన్లో తరగతుల షెడ్యూల్ను రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అధికారులు పాఠాలు ప్రసారం చేస్తున్నారు.
సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ పున:ప్రారంభం.. అన్నీ వసతులు సిద్దం: విద్యాశాఖ మంత్రి
సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు టీవీ9తో చెప్పారు. 18 నెలలుగా స్కూళ్లు మూతపడటంతో పిల్లలకు సైకలాజికల్ గా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష తరగతులతో పోలిస్తే ఆన్ లైన్ క్లాసులు అంత ఎఫెక్టివ్ గా ఉండవన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో చిన్నచిన్న సమస్యలు ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్న సబితా ఇంద్రారెడ్డి… గ్రామ సర్పంచుల సహకారంతో వాటిని అధిగమించాలంటూ హెడ్మాస్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను సిద్ధంచేయడం, వసతుల కల్పించడంలో లోకల్ బాడీస్ తప్పనిసరిగా ఇన్వాల్స్ కావాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఈనెల 30లోపు స్కూళ్లలో క్లీనింగ్ పనులు పూర్తి కాకపోతే హెడ్మాస్టర్లనే బాధ్యులుగా చేస్తామంటూ హెచ్చరించారు. 31లోగా స్కూళ్లను సిద్ధంచేసి రిపోర్ట్ ఇవ్వాలని హెడ్మాస్టర్లను ఆదేశించినట్లు మంత్రి సబిత తెలిపారు.
Also Read: ఈ చేప ఎంత లక్కీనో.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.. క్షణకాలంలో చావు తప్పింది