Viral Video: ఈ చేప ఎంత లక్కీనో.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు… క్షణకాలంలో చావు తప్పింది

ఫేట్ ఎప్పుడు.. ఎలా మారుతుందో అస్సలు ఊహించలేం. చూస్తుండగానే ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. ఈ సామెత మనుషులకు మాత్రమే కాదు...

Viral Video: ఈ చేప ఎంత లక్కీనో.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు... క్షణకాలంలో చావు తప్పింది
Fish Life
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 30, 2021 | 9:31 PM

ఫేట్ ఎప్పుడు.. ఎలా మారుతుందో అస్సలు ఊహించలేం. చూస్తుండగానే ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. ఈ సామెత మనుషులకు మాత్రమే కాదు పక్షులు, జంతువులకు కూడా అప్లై అవుతుంది. ఈ థీమ్‌కు అచ్చుగుద్దినట్లు సరితూగే వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత నిజంగా అదృష్టం అంటే ఏంటో మీకు తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు సమస్యల్లో చిక్కుకుంటారు. కానీ ఆ సమయంలో మనం ఎంత ఓపిగ్గా ఉన్నామనే విషయాన్ని బట్టి మన లైఫ్ డిసైడవుతుంది. తాజాగా ఓ చేప క్షణకాలంలో డేంజర్ నుంచి తప్పించుకుని తన ప్రాణాన్ని నిలుపుకుంది. ఒక చేప  జీవితం రెండు ప్రమాదకరమైన మాంసాహారుల పంజాలలో చిక్కుకుంటుంది. కానీ ఆ చేప ఫేట్ ఆ క్షణంలో బాగుంది. ఆల్మోస్ట్ బాతు నోట్లోకి వెళ్లి కూడా ప్రాణాలతో బయటపడింది. డేగ కాళ్ల నుంచి క్షణాల్లో తప్పించికుని నీటిలోకి జారుకుంది. సరైన సమయంలో సమయస్ఫూర్తితో ఆ రెండింటి నుంచి.. తప్పించుకుని.. బ్రతుకు జీవుడా అంటూ బయటపడింది.

ముందుగా వీడియో వీక్షించండి 

వీడియోలో మీరు నీటిలో బాతు చేపను వెటాడి నోట పట్టడం మీరు చూడవచ్చు. అదే సమయంలో ఆకాశం నుండి డేగ ఆ చేపను దక్కించుకునేందుకు దూసుకువచ్చింది.  డేగ తన పాదాలలో చేపలను పట్టుకోవడానికి దూకుతుండగా, చేప అకస్మాత్తుగా పక్షుల ముక్కు నుంచి జారుకుని నీటిలో పడింది. ఈ విధంగా,  రెండు వైపులా ప్రమాదం వెంటాడినప్పటికీ.. చేప రెప్పపాటులో బ్రతకు నిలుపుకుంది. ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది. వీడియోకు ‘లక్కీ ఫిష్’ అనే క్యాప్షన్ కూడా రాశారు. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు కూడా ఈ చేప అదృష్టం నెక్ట్స్ లెవల్ అని అనుకుంటూ ఉంటారు. వార్తల రాసే వరకు ఈ వీడియోకు 4.5 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also Read: ఏపీలో ఆ ప్రాంతం.. తెలంగాణలో ఈ ప్రాంతం.. గంజాయి రవాణా వెనుక దిమ్మతిరిగే సిత్రాలు

 ఏపీలో కొత్తగా 878 కరోనా కేసులు… ఆ జిల్లాలో గుబులు రేపుతోన్న వైరస్ వ్యాప్తి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో