AP Corona Cases: ఏపీలో కొత్తగా 878 కరోనా కేసులు… ఆ జిల్లాలో గుబులు రేపుతోన్న వైరస్ వ్యాప్తి
ఏపీలో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నాయి. అయితే నిన్న సండే కావడంతో టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. కొత్తగా 878 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 41,173 శాంపిల్స్ టెస్ట్ చేయగా 878 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2013001కి చేరింది. కొత్తగా 13 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13838 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,182 మంది వైరస్ కారణంగా కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1984301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14862 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,65,76,995 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూర్ జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొ క్క రు చొప్పున ప్రాణాలు విడిచారు. కాగా చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 255 కొత్త కేసులు వెలుగుచూశాయి.
జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి
#COVIDUpdates: 30/08/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,10,106 పాజిటివ్ కేసు లకు గాను *19,81,406 మంది డిశ్చార్జ్ కాగా *13,838 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,862#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/VTqkPI9kp7
— ArogyaAndhra (@ArogyaAndhra) August 30, 2021
కరోనా సమాచారం మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి. https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19