Ganja smuggling: ఏపీలో ఆ ప్రాంతం.. తెలంగాణలో ఈ ప్రాంతం.. గంజాయి రవాణా వెనుక దిమ్మతిరిగే సిత్రాలు

హైదరాబాద్ లో టన్నుల కొద్దీ పట్టుబడ్డ కోట్లాది రూపాయల విలువైన గంజాయి.. కథ ఏంటి? దీని రవాణా స్టార్టింగ్ పాయింట్ ఏది? ఇది చేరేది ఎక్కడ? తాజాగా పట్టుబడ్డ గంజాయి డాన్ షిండేకి....

Ganja smuggling: ఏపీలో ఆ ప్రాంతం.. తెలంగాణలో ఈ ప్రాంతం.. గంజాయి రవాణా వెనుక దిమ్మతిరిగే సిత్రాలు
Ganja
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 30, 2021 | 5:38 PM

హైదరాబాద్ లో టన్నుల కొద్దీ పట్టుబడ్డ కోట్లాది రూపాయల విలువైన గంజాయి.. కథ ఏంటి? దీని రవాణా స్టార్టింగ్ పాయింట్ ఏది? ఇది చేరేది ఎక్కడ? తాజాగా పట్టుబడ్డ గంజాయి డాన్ షిండేకి ఇక్కడెవరెవరు కోపరేట్ చేస్తుంటారు. ఇతడి గంజాయి ఆపరేషన్ ఎలా సాగుతుంది.. ఈ మత్త కథ సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలుసుకుందాం పదండి.  గత కొన్నాళ్లుగా.. తప్పించుకుని తిరుగుతున్న గంజాయి డాన్ షిండే పోలీసులకు చిక్కాడు. ఇతడి గంజాయి స్మగ్లింగ్‌పై ఎప్పట్నుంచో కన్నేసిన అధికారులు.. ఎట్టకేలకు పట్టుకున్నారు. డాన్ షిండేను పట్టుకోడానికిగానూ.. ఆరు రాష్ట్రాల్లో గాలించారు. దక్షిణాది గంజాయిని వేలల్లో కొని.. లక్షల్లో అమ్ముతుంటాడు షిండే. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి డాన్ కి కోపరేట్ చేస్తున్న వారిపై నిఘా పెట్టడంతో ఇతడ్ని పట్టుకోగలిగారు అధికారులు.

గంజాయి దందా ఎలా సాగుతుందో.. ఏపీ తెలంగాణాల్లో గంజాయి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయో.. పక్కా ఇన్ఫర్మేషన్ సంపాదించింది టీవీ9. తెలంగాణలోని నారాయణ్ ఖేడ్. ఏపీలోని నర్సీపట్నం గంజాయి మాఫియాపై నిఘా పెట్టి మరీ ఇక్కడ సాగే గంజాయి దందాను బట్టబయలు చేసింది. దమ్మర దమ్ అంటూ అక్కడ ముంబై పబ్బుల్లో బార్లలో గంజాయి గుప్పు ప్పుమంటుందంటే.. అందుకు ఆధారం.. విశాఖ ఏజెన్సీ లో పండే గంజాయే. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు సిసలు గాంజా జర్నీ.

లేటెస్ట్‌గా హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డులో 3 వేల 4వందల కిలోల గంజాయి పట్టుబడింది. ఓపెన్ మార్కెట్ లో దీని ధర ఎంతంటే.. అక్షరాలా 21 కోట్లు.. ఇంత భారీ ఎత్తున గంజాయి చిక్కిందంటే.. అదంతా ఒక్కసారి తరలిస్తున్నది కానే కాదు. నెలల తరబడి రకరకాల మార్గాల గుండా ఒక చోటకు చేర్చి డంప్ చేస్తారు. ఈ భారీ మొత్తం గంజాయిని.. హైదరాబాద్ గుండా.. ముంబై వంటి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలిస్తుంటారు. దటీజ్ రూట్ మ్యాప్ ఆఫ్ గంజాయ్. మన తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పంట పండే ప్రాంతాలు రెండే రెండు. ఒకటి తెలంగాణలోని నారాయణ ఖేడ్. ఇక ఏపీలో నర్సీపట్నం. ఒక్క విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లోనే గంజాయి సాగు పదివేల ఎకరాల్లో సాగుతుంది. ఒక్క ఎకరా నుంచి 4 వందల కిలోల గంజాయి పంట పండుతుంది. ఇక్కడ ఒక కిలో ధర కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే. అదే హైదరాబాద్ వచ్చి చేరే సరికి 10 వేల వరకూ పలుకుతుంది. ఇక ముంబై చేరే సరికల్లా.. గంజాయి ధరకు రెక్కలు మొలుస్తాయ్. ఇరవై వేల వరకూ ఈ మత్తు ధర గుప్పు గుప్పుమంటుంది.

ఈ గంజాయి అక్రమ రవాణా రకరకాలుగా సాగుతుంది. ఒక్కసారి ఏపీ దాటాక.. ఇక తెలంగాణ వంతు. తెలంగాణలో స్మగ్లర్లు మరో రకం అడ్డదారులు వాడుతుంటారు. మొత్తంగా ఏపీ- నుంచి తెలంగాణ మీదుగా- మహారాష్ట్ర చేరుతుంది గంజాయి మాల్.  గంజాయి అక్రమ రవాణాకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు అడ్డగా మారుతోంది. ఏవోబీ నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా ముంబై  తరలిస్తున్నారు. మొత్తం 44 చెక్‌పోస్టులు దాటి ముంబై చేరుతోంది. పూల మొక్కల మధ్య పెట్టి ..సిమెంటు బస్తాల మాటున గంజాయి తరలిస్తున్నారు. ఆయిల్ డబ్బాల్లో.. గంజాయి కుక్కి తీసుకెళుతుంటారు. ట్రక్కు అడుగు భాగంలో ఒక లేయర్ వేసి.. మరీ ట్రాన్స్ పోర్ట్ చేస్తుంటారు. గంజాయ్ అంటే విశాఖ ఏజెన్సీ గంజాయే.. దీన్ని ఒక్కసారి పీలిస్తే ఉంటుందీ నా సామిరంగా.. ఊగిపోవడమే అన్నది.. మత్తు మార్కెట్లో ఉన్న గమ్మత్తైన టాక్. ఈ మత్తుకోసం దేశ వ్యాప్తంగా పడి సచ్చిపోతుంటారు.. విశాఖ గంజాయి మత్తు పీల్చి ఊగిపోవాలని పరితపించేవాళ్లు లెక్కలేనంత మంది.. గంజాయ్ మార్కెట్ కే ఇది టాప్ క్లాస్ మాల్. గొవా డ్రగ్స్ ను ఎలా అడుగుతుంటారో ‘వైజాగ్ గాంజా హై క్యా’ అంటూ విశాఖ ఏజెన్సీ గంజాయిని అడిగి మరీ తీసుకుంటారు..

రమణా చెక్ పోస్ట్ పడతాదిరా! అంటూ వీళ్లు మొత్తం 3 పోలీస్ స్టేషన్ల కళ్లు కప్పి తప్పించుకుంటారు. అవే 1. నర్సీపట్నం- 2. మాకవరపాలెం- 3. కోటవురట్ల. ఈ స్టేషన్లోని పోలీసు సిబ్బంది కళ్లు కప్పి.. మరో ఆరు చెక్ పోస్టులుగానీ పాయింట్లను గానీ క్రాస్ చేస్తారు. అవి మరేవో కావు.. 1. చింతపల్లి- 2. లంబసింగి- 3. మర్రిపాలెం- 4. నర్సీపట్నం- 5. రోలుగుంట- 6. శరభవరం. ఈ చెక్ పోస్టులను తప్పించడం కోసంగానూ కొన్ని అడ్డదారులు ఉపయోగిస్తుంటారు. అవే లంబసింగి- మర్రిపాలెం- మన్యపువురట్ల- రాచపల్లి- రోలుగుంట- చెట్టుపల్లి- వీటి మీదుగా హైవే పైకి వస్తారు.

ఒక్కసారి విశాఖ చెక్ పోస్టులు దాటేశామో.. ఇక అడిగే వాళ్లే ఉండరు. కారణం.. విశాఖలో మాత్రమే గంజాయి కంటూ ప్రత్యేక తనిఖీలుంటాయి. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ గంజాయి మాఫియా చిక్కాల్సిందే. లేకుంటే.. పక్కా సమాచారంతో దొరకాల్సిందే. అంతే తప్ప.. మిగిలినదంతా నల్లేరు మీద నడకే. అలా సీలేరు. ఖమ్మం- భద్రాచలంలోని అడ్డదారుల గుండా- హైదరాబాద్ చేరుతుంటారు. వైజాగ్ టూ హైదరాబాద్- వయా రాజమండ్రి ఇదో రూట్. విజయవాడ టూ హైదరాబాద్. హైదరాబాద్ టూ ముంబై వయా జహీరాబాద్. ఇది మరో రూట్.

ఇలా నా దారి రహదారి అంటూ గంజాయి మాఫియా వాడుతున్న రూట్ మ్యాప్ లు పలు రకాలు. విజయవాడ నుంచి హైదరాబాద్… ట్రక్కుల ద్వారా తరలిస్తున్న గంజాయిని పెద్ద ఎత్తున పట్టుకుంటోంది ఎన్సీబీ. పక్కా సమాచారం చిక్కడం వల్లే.. హైదరాబాద్- ఓఆర్‌ఆర్‌ పై దొరికిపోయారు గంజాయి స్మగ్లర్లు.

Also Read:కోటి ఆశలతో ప్రయాణాలు.. కాటికి చేరిన వైనాలు.. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువులను బలి తీసుకుంటున్న ప్రమాదాలు

మేనత్తతో ప్రేమాయణం.. గర్భవతిని చేసిన వైనం.. ఆపై ఊహించని విషాదం

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో