Crime News: మైనర్ బాలుడితో ప్రేమాయణం.. ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి.. ఆపై ఏం చేసిందంటే..?
Crime News: తమిళనాడులోని కోయంబత్తూరులో వింత సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలను ట్రాప్ చేయడం వినుంటాం. కానీ
Crime News: తమిళనాడులోని కోయంబత్తూరులో వింత సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలను ట్రాప్ చేయడం వినుంటాం. కానీ ఇక్కడ ఓ 19 ఏళ్ల యువతి ఓ మైనర్ బాలుడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు స్థానికంగా ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తుంది. అక్కడికి ప్రతిరోజు ఓ బాలుడు పెట్రోల్ పోసుకోవడానికి వచ్చేవాడు. మెళ్లగా మాటలు కలిపి అతడిని ట్రాప్‌లో పడేసింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో ప్రేమగా మారి ఫోన్ నెంబర్లు మార్చుకునేవరకు వచ్చింది.
ఏడాది పాటు ఆ యువతి, మైనర్ బాలుడు జాలీగా కలిసి గడిపారు. కాగా, వీరిద్దరి విషయం మైనర్ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు. అయినా యువతి తన తీరు మార్చుకోలేదు. అంతేకాక ఎలాగైనా ఆ బాలుడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఇదే సమయంలో బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. విషయం తెలిసిన సదరు యువతి, బాధిత యువకుడిని చూడటానికి కోయంబత్తూరులోని ఆసుపత్రికి వచ్చింది.
ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇంట్లో వారికి తెలియకుండా డిండిగల్ జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. తర్వాత కోయంబత్తూరుకు వచ్చి ఉంటున్నారు. కాగా ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు యువతిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.