AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Rains: తెలంగాణలో పొంగుతున్న వాగులు వంకలు.. ప్రవాహంలో చిక్కుకుని ఒకరు మృతి.. మరొకరిని రక్షించిన పోలీసులు

వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Telangana Rains: తెలంగాణలో పొంగుతున్న వాగులు వంకలు.. ప్రవాహంలో చిక్కుకుని ఒకరు మృతి.. మరొకరిని రక్షించిన పోలీసులు
Yuvati Gallanthu
Sanjay Kasula
|

Updated on: Aug 30, 2021 | 6:19 PM

Share

వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదివారం నుంచి కూడ రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తున్నాయి. దీంతో వాగుల్లో వరద ప్రవాహం ఎక్కువైంది. తాజాగా జరిగిన ఘటనల్లో ఒకరు వరదల్లో చిక్కుకుని మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులో స్కూటీ చిక్కుకొని ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. రాజపేట మండలం దోసలవాగు వద్ద ఓ ఘటన చోటు చేసుకొంది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.స్కూటీపై ముగ్గురు వెళ్తున్న సమయంలో వరద ఉధృతికి సింధూజ, హిమబిందు వాగులో కొట్టుకుపోయారు. ఇందులోని ఓ యువతిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకొని.. స్థానికుల సహాయంతో వారి కోసం గాలింపు చేపట్టారు.

సాయంత్రం సమయంలో సింధూజ మృతదేహాన్ని వెలికి తీశారు. హిమబిందు ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి హిమబింధు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Yuvathulu Gallanthu

వాగులో చిక్కుకున్న కారు..

ఇక సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మిట్టపల్లి గ్రామ శివారులో కల్వర్టు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే సమయంలో వాగును దాటేందుకు ప్రయత్నించడంతో కారు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ కాలనీవాసులు కూడవెల్లి సంతోష్, మురం భాను ఇరువురు కలసి సిద్దిపేట నుండి వరంగల్‌కు కారులో వెళ్తుండగా బస్వాపూర్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున మిట్టపల్లి- కొత్తపల్లి గ్రామాల నుండి వెళ్లారు.

మిట్టపల్లి గ్రామ శివారులో కల్వర్టు వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున పవాహంలోకి కారుతో వెళ్లారు. నీటి ప్రవాహంలో కారు నిలిచిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. సమాచారం అందిన వెంటనే త్రీ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే టోయింగ్ వాహనాన్ని తెప్పించి నీటి ఉధృతి లో తట్టుకున్న కారును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Overflowing Stream

బంగాళాఖాతంలో అల్పపీడనం..

ఇదిలావుంటే.. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లుండి ఒకట్రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణకేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..

నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..