AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penkutillu: తాత తండ్రుల లోగిళ్లు.. పెద్దరికానికి చిహ్నాలు.. పల్లెటూర్లలో పెంకుటిల్లు.. ఆ ఆలోచనకు రూపం యాదగిరి ఇల్లు

పెంకుటిల్లంటే అతనికి ఇష్టం.. అంతే కాకుండా తన తాత,తండ్రిల నుంచి వచ్చిన ఇల్లు కాబట్టి అతనికి కూల్చడానికి మనసు రాలేదు.. దాంతో ఎంత ఖర్చు అయినా పర్లేదనుకొని తనకు కావాల్సిన విధంగా..

Penkutillu: తాత తండ్రుల లోగిళ్లు.. పెద్దరికానికి చిహ్నాలు.. పల్లెటూర్లలో పెంకుటిల్లు.. ఆ ఆలోచనకు రూపం యాదగిరి ఇల్లు
Penkutillu
Sanjay Kasula
|

Updated on: Aug 30, 2021 | 7:20 PM

Share

ఒకప్పుడు కుటుంబ గౌరవానికి ప్రతీక మండువా లోగిలి. ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనాలు ఆ ఇల్లు. ఆ ఇంటి యజమానికి సంఘంలో గౌరవం ఉండేది. ఆ తరువాత ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో మండువాలోగిళ్ల అవసరం లేకపోయింది. తెలంగాణలోని చాలా ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మండువాలోగిళ్లు మనకు కనిపిస్తుంటాయి. గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండే వాటి నిర్మాణాలు, విశాలమైన గదులు ఎంతో అబ్బురపరుస్తాయి.

దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు గ్రామాల్లో భవంతి లోగిళ్లు ఎక్కువగా ఉండేవి. పచ్చని పంటచేలు, కాలువలతో కళకళలాడే పల్లెలకు ఈ మండువాలోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తరువాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లో కూడా కాంక్రీటు భవనాల నిర్మాణం పెరిగింది. దీంతో పల్లెల్లో భవంతి లోగిళ్లు కనుమరుగవుతున్నాయి.

పెంకుటిల్లంటే అతనికి ఇష్టం.. అంతే కాకుండా తన తాత,తండ్రిల నుంచి వచ్చిన ఇల్లు కాబట్టి అతనికి కూల్చడానికి మనసు రాలేదు.. దాంతో ఎంత ఖర్చు అయినా పర్లేదనుకొని తనకు కావాల్సిన విధంగా ఇల్లును తీర్చిదిద్దుకున్నాడు. మొదట చాలా మంది నవ్వినా మరమ్మత్తు చేసిన తరువాత ఇల్లు భాగుందని ఆసక్తిగా చూస్తున్నారు..సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన కోటగిరి యాదగిరిగౌడ్.. తన ఆలోచనలు, ఆదర్శాన్ని రంగరించి  తీర్చిదిద్దుకున్న పెంకుటిల్లు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. సుమారు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ఇల్లు పెద్ద పెద్ద దూలాలతో నాలుగు గదులను నిర్మించారు. అయితే తనకు పెంకుటిల్ల మీద ఉన్న మమకారంతో దాన్ని కూల్చివేయడం ఇష్టం లేక యాదగిరిగౌడ్ అదే ఇంటిని మరమ్మత్తు చేయించాలనుకున్నారు.

సుమారు రూ .30 లక్షలు ఖర్చు చేసి ఎంతో అందంగా తీర్చి దిద్దుకున్నారు. తన తాత, తండ్రి నిర్మించిన ఇల్లు కావడంతో కూల్చకుండా చిన్న చిన్న మార్పులతో అందంగా తిరిగి తీర్చి దిద్దారు. వారిపై ఉన్న ప్రేమతో పాటు పల్లెటూర్లలో పెంకుటిల్లు ఉండాలనే యాదగిరి గౌడ్ మరింత సుందరంగా మార్చారు. ఆ ఇంటిని కూల్చి భవనం నిర్మించుకునేందుకు ఇష్టపడలేదు.

Penkutillu 01

Penkutillu

దీంతో పూర్తిగా పై కప్పు తొలగించి బెంగుళూరు పెంకులు వేసి, టేకు కర్రతో చూడచక్కగా నిర్మాణం చేసుకున్నాడు.. ఇంటి పై కప్పుతో పాటు , ఇంటి ముందు చూడడానికి అందమైన కళాకృతుల డిజైన్లు , ఆకరమైన ఆకృతులతో కూడిన తలుపులు బిగించారు.

ఇంటిలోపల కూడా భవనంలో ఉండే అన్నిరకాల ఆధునిక సౌకర్యాలతో మరమ్మత్తులు చేయించారు. చూడటానికి అది పెంకుటిల్లే అయినా.. ఆ ఇంట్లో అన్నీ పట్టణంలో ఉండే భవనం లాగే.. వసతులు ఏర్పాటు చేసుకున్నారు. ఇది పెంకుటిల్లా .. లేక భవంతా..అనే విధంగా చూపరులను ఆ ఇల్లు ఆకట్టుకుంటుంది.

శివతేజ, మెదక్.

ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..

నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..